ట్రినిడాడ్: టీ20 వరల్డ్‌కప్(T20 World Cup) వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చింది వెస్టిండీస్. ట్రినిడాడ్‌లో జరిగిన మ్యాచ్‌లో 35 రన్స్ తేడాతో వెస్టిండీస్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 రన్స్ చేసింది. విండీస్ బ్యాటర్లలో పూరన్ 75, పావెల్ 52, చార్లెస్ 40, రూథర్‌ఫోర్డ్ 47 రన్స్ కొట్టారు. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 222 రన్స్ మాత్రమే చేసింది. ఆసీస్ బ్యాటర్లలో జోష్ ఇంగ్లిస్ 55, నాథన్ ఎల్లిస్ 39 రన్స్ చేశారు.
A great start ahead of our ICC Men’s T20 World Cup campaign.👏🏿#WIREADY | #T20WorldCup pic.twitter.com/H5RnGm2Irs
— Windies Cricket (@windiescricket) May 31, 2024