నార్త్‌సౌండ్ (అంటిగ్వా): ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన వెస్టిండీస్.. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విండీస్ బౌలర్ల ధాటికి బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 103 పరుగులకే ఆలౌట్ కాగా.. అనంతరం విండీస్ 265 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా 245 రన్స్ చేసి.. ప్రత్యర్థికి 84 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విధించింది. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ 3 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసి విజయతీరాలకు చేరింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 7 వికెట్లు పడగొట్టిన రోచ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.