బాసెటెర్రీ(సెయింట్ కిట్స్ అండ్ నెవిస్): వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఎట్టకేలకు 10 ఏండ్ల తర్వాత బంగ్లాదేశ్‌పై వన్డే సిరీస్ సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన రెండో వన్డేలో విండీస్ 7 వికెట్ల తేడాతో బంగ్లాపై ఘన విజయం సాధించింది.
బంగ్లా నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 36.5 ఓవర్లలో 230/3 స్కోరు చేసింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్(82) అర్ధసెంచరీతో విజృంభించగా, ఎవిన్ లెవిస్(49), కీసి కార్టీ(45) రాణించారు. రానా, హుస్సేన్, అఫిఫ్ ఒక్కో వికెట్ తీశారు. తొలుత జెడెన్ సీల్స్ (4/22) ధాటికి బంగ్లాదేశ్ 45.5 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌటైంది. మహ్మదుల్లా(62) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. సీల్స్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.