దుబాయ్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ సెమీఫైనల్స్‌కు ప్రవేశించింది. మంగళవారం దుబాయ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన గ్రూప్-బీ చివరి లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో గెలిచి సెమీస్‌కు చేరింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 142 పరుగుల లక్ష్యాన్ని విండీస్ అమ్మాయిలు 18 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించారు.
ఛేదనలో ఆ జట్టు సారథి హీలి మాథ్యూస్ (50), జోసెఫ్ (52), డాటిన్ (27) ధాటిగా ఆడారు. ఇంగ్లండ్ తరఫున సీవర్ బ్రంట్ (57) పోరాడింది. ఈ ఓటమితో ఇంగ్లీష్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. సెమీస్‌లో ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికాతో తలపడనుండగా వెస్టిండీస్, న్యూజిలాండ్‌ను ఢీకొననుంది.