ముంబై : వెస్టిండీస్ యువ సంచలన బౌలర్ షామర్ జోసెఫ్( Shamar Joseph).. భారత్ టూరు నుంచి దూరం అయ్యాడు. గాయం కారణంగా అతన్ని తుది జట్టు నుంచి తప్పించారు. అక్టోబర్ రెండో తేదీ నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. జోసెఫ్ స్థానం విండీస్ బోర్డు ఆల్‌రౌండర్ జోహన్ లేయిన్కు స్థానం కల్పించింది. ఈ విషయాన్ని విండీస్ క్రికెట్ తన ఎక్స్ అకౌంట్లో ప్రకటించింది. అయితే 26 ఏళ్ల బౌలర్ జోసెఫ్‌కు ఎటువంటి గాయం అయ్యిందన్న విషయాన్ని వెల్లడించలేదు. అక్టోబర్ 18వ తేదీ నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్ సమయంలో జోసెఫ్‌పై మళ్లీ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు విండీస్ బోర్డు చెప్పింది.
షామర్ జోసెఫ్ లేకపోవడం విండీస్‌కు పెద్ద దెబ్బే. గయానాకు చెందిన ఆ స్పీడ్ బౌలర్ ప్రస్తుతం టాప్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటి వరకు 11 టెస్టులు ఆడిన అతను 51 వికెట్ల తీసుకున్నాడు. 21.66 సగటుతో అతను వికెట్లు తీశాడు. జోసెఫ్ స్థానంలో తీసుకున్న లేయిన్ వయసు 22 ఏళ్లు. అతను బార్బడోస్‌కు చెందిన ఆల్‌రౌండర్. 19 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతను 495 రన్స్ స్కోర్ చేసి, 66 వికెట్లు తీసుకున్నాడు.
Squad Update 🚨
Johann Layne has replaced Shamar Joseph in the squad for the test series against India.
Joseph has been ruled out due to an injury and will be re-evaluated ahead of the Bangladesh limited overs series.#INDvsWI | #MenInMaroon pic.twitter.com/2z5uiZSicu
— Windies Cricket (@windiescricket) September 26, 2025