కెన్సింగ్టన్: ఇంగ్లండ్‌తో జరిగిన మూడవ వన్డేలో .. వెస్టిండీస్ బౌలర్ అల్జరీ జోసెఫ్(Alzarri Joseph).. ఆ జట్టు కెప్టెన్ శాయ్ హోప్‌పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇన్నింగ్స్ మూడవ ఓవర్లో బౌలింగ్ చేసిన తర్వాత.. కెప్టెన్ మీద కోపంతో మైదానం వదిలి వెళ్లాడు. ఫీల్డింగ్ విషయంలో కెప్టెన్ హోప్, బౌలర్ జోసెఫ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. వాస్తవానికి ఆ ఓవర్‌ను మెడిన్‌గా వేసినా.. కెప్టెన్ మీద ఆగ్రహంతో జోసెఫ్ .. మైదానం వదిలి డగౌట్‌కు వెళ్లిపోయాడు. ఫీల్డింగ్‌ను అమర్చడంలో కెప్టెన్ హోప్ నిర్ణయాలను జోసెఫ్ తప్పుపట్టాడు. ఓ ఓవర్ పాటు అతను నిరసన వ్యక్తం చేశాడు. ఆ సమయంలో పది మంది ఆటగాళ్లు మాత్రమే విండీస్‌కు ఫీల్డింగ్ చేశారు. ఒక ఓవర్ తర్వాత జోసెఫ్ మళ్లీ జట్టుతో కలిసి చేరాడు.
కీలకమైన మూడవ వన్డేలో విండీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బ్రాండన్ కింగ్, కీసీ కార్టీలు సెంచరీలు నమోదు చేశారు. దీంతో విండీస్ 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్నది.