WI vs SA : ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్ (West Indies), దక్షిణాఫ్రికా(South Africa)ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో విజయం సాధించాలనుకున్న సఫారీల ఆశలపై విండీస్ బ్యాటర్లు నీళ్లు చల్లారు. దాంతో, సిరీస్‌లో ముందంజ వేయాలనుకున్న బవుమా బ్యాచ్‌కు నిరాశే మిగిలింది. అయితే.. ప్రపంచ టెస్టు క్రికెట్లో మాత్రం చెక్కుచెదరకుండా ఉన్న ఓ రికార్డు బద్ధలైంది.
టెస్టు ఫార్మాట్లో 28 మ్యాచ్‌ల తర్వాత ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. దాదాపు 384 రోజులకు టెస్టుల్లో తొలి డ్రా నమోదైంది. దాంతో, 377 రోజులతో ఉన్న రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. 1960 – 1970ల మధ్య 377 రోజుల తర్వాత తొలిసారి ఓ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది.
With eight wickets in the Test, Keshav Maharaj is the Player of the Match 🏆https://t.co/KNyTY4RYoB #WIvSL pic.twitter.com/Q1fVLwP9PN
— ESPNcricinfo (@ESPNcricinfo) August 11, 2024
ఇంగ్లండ్ గడ్డపై వైట్ వాష్‌కు గురైన విండీస్ స్వదేశంలో బోణీ కొట్టలేకపోయింది. ట్రినిడాట్ టెస్టులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా బ్యాటింగ్ తీసుకున్నాడు. అయితే.. తొలిరోజు వర్షం కారణంగా 15 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యంకాగా.. రెండో రోజు మొత్తం ఆడిన సఫారీ జట్టు 357కు ఆలౌటయ్యింది.
Both teams shake hands, and it’s a draw in Port of Spain!https://t.co/1ftNFI3csW #WIvSA pic.twitter.com/Y5saA3NNlL
— ESPNcricinfo (@ESPNcricinfo) August 11, 2024
అనంతరం ఆతిథ్య జట్టును కేశవ్ మహరాజ్(4/76), కగిసో రబడ(3/56)లు వణికించారు. దాంతో, బ్రాత్‌వైట్ సేన 233 రన్స్‌కే కుప్పకూలింది. ఆ తర్వాత ఆడిన సఫారీ జట్టు 173/3 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఐదోరోజు ఆతిథ్య జట్టు ఆట ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 201 రన్స్ చేసింది. దాంతో, మొదటి టెస్టు డ్రాగా ముగిసింది.