Bangladesh Cricket Board : భారత్, బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలపై అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించడం, టీ20 ప్రపంచకప్ కోసం తమ జట్టును ఇండియాకు పంపమని బంగ్లా బోర్డు ఐసీసీకి లేఖ రాయడం.. వంటివి ఇరుబోర్డుల మధ్య దూరాన్ని పెంచాయి. ఈ నేపథ్యంలో బంగ్లా బోర్డు చైర్మన్ మరో వివాదానికి తెరలేపాడు.ఆర్ధిక కమిటీ ఛైర్మన్ నజ్ముల్ ఇస్లాం మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (Tamim Iqbal)ను ‘ఇండియన్ ఏజెంట్'(Indian Agent) అని పేర్కొంటూ ఫేస్బుక్ పోస్ట్ పెట్టాడు.
బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యలను నిరసిస్తూ ఐపీఎల్ నుంచి ఆ దేశ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను తప్పించడంతో ఇరుదేశాల మధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రతిచర్యగా భద్రతా కారణాల రీత్యా భారత్‌లో టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడబోమని బంగ్లాదేశ్ బోర్డు ఐసీసీకి లేఖ రాసింది. ఈ నిర్ణయాన్ని మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ వ్యతిరేకించాడు. దాంతో.. అతడిని లక్ష్యంగా చేసుకొని బంగ్లా బోర్డు కమిటీ, ఆర్ధిక కమిటీ ఛైర్మన్ నజ్ముల్ ఇస్లాం పోస్ట్ పెట్టాడు.
“Proven Indian agent”: Bangladesh icon insulted by BCB board member over T20 World Cup stancehttps://t.co/D7I1Um8CK7 pic.twitter.com/405FcLeq6M
— CricketNDTV (@CricketNDTV) January 9, 2026
‘ఈసారి బంగ్లాదేశ్ ప్రజలు తమ కళ్లతో ప్రత్యక్షంగా చూశారు. మరో భారత ఏజెంట్ పుట్టుకొచ్చాడు’ అని తమీమ్ ఇక్బాల్‌ను ఉద్దేశించి నజ్ముల్ ఇస్తాం పోస్ట్ పెట్టాడు. అయితే.. అతడు ఆ పోస్ట్‌ను తొలగించడానికి ముందే సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్లు వైరలయ్యాయి. ఆ పోస్ట్‌లు చూసినవాళ్లలో కొందరు నజ్ముల్‌కు మద్దతుగా, మరికొందరు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు.
ఈమధ్యే ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో జెర్సీ, ట్రోఫీ ఆవిష్కరణలో పాల్గొన్న తమీమ్ మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్‌ను తప్పించడం దురదృష్టకరం. అందులో ఏ సందేహమూ లేదు. నేను ఒకవేళ బోర్డులో ఉండిఉంటే మనదేశ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకునేవాడిని. అప్పటికప్పుడు ఆవేశంగా స్పందించడం సమస్యను జటిలం చేస్తుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా సమస్యలు చర్చలతో పరిష్కారమవుతాయి.
Former Bangladesh captain Tamim Iqbal has called for dialogue amidst the BCB-ICC-BCCI standoff #T20WorldCup2026 pic.twitter.com/uGq9IhQTvd
— Cricbuzz (@cricbuzz) January 9, 2026
నేనైతే ప్రపంచ క్రికెట్లో మనజట్టు స్థాయిని ఆలోచించి నిర్ణయానికి వచ్చేవాడిని. ఈరోజు మన తీర్మానంతో బంగ్లా జట్టు పదేళ్లు వెనక్కి వెళ్లే అవకాశముంది. మన బోర్డుకు ఐసీసీ నుంచే 90 నుంచి 95 శాతం ఆదాయం వస్తోంది. అయితే.. అందిలానే నాకు కూడా బంగ్లా క్రికెట్‌కు శ్రేయస్సే తొలి ప్రాధాన్యం’ అని పేర్కొన్నాడు. అంతే.. అప్పటినుంచి బంగ్లా బోర్డు, మాజీ ఆటగాళ్లు తమీమ్‌ను టార్గెట్ చేశారు. అయితే.. కొందరేమో అతడు చెప్పినదాంట్లో తప్పేముందీ అని కౌంటర్ ఇస్తున్నారు.