పెర్త్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో రేపటి నుంచి పెర్త్‌లో తొలి టెస్టు ప్రారంభంకానున్నది. రోహిత్ శర్మ గైర్హాజరు నేపథ్యంలో ఆ టెస్టు మ్యాచ్‌కు బుమ్రా(Jasprit Bumrah) కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడాడు. కెప్టెన్సీని ఓ పోస్టుగా భావించడం లేదని, బాధ్యతలను ప్రేమిస్తానని, కఠినమైన పని చేయడం చిన్నపటి నుంచి అలవాటు అని, కఠిన పరిస్థితుల్ని ఎదుర్కోవడం సమస్య కాదు అని, దీన్ని ఒక కొత్త ఛాలెంజ్‌గా భావిస్తానని బుమ్రా పేర్కొన్నారు. రోహిత్ కెప్టెన్సీలో అయినా లేక కోహ్లీ కెప్టెన్సీలో అయినా.. అన్ని విధాల తన శక్తిని ప్రదర్శించినట్లు చెప్పాడు. రోహిత్, కోహ్లీ నుంచి నేర్చుకున్నానని, సీనియర్ ప్లేయర్ అయిన తర్వాత కొత్త వారికి తన అనుభవాలు చెప్పినట్లు బుమ్రా వెల్లడించాడు. చాలా తక్కువ మంది ఆటగాళ్లు టెస్టు క్రికెట్ ఆడారని, కెప్టెన్లు కూడా తక్కువే అని, భారత జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నాడు.
ఇటీవలు న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఇండియా దారుణంగా ఓడింది. 3-0 తేడాతో ఆ సిరీస్‌ను కోల్పోయింది. అయితే ఆ ఓటమి గురించి ఆలోచిచడం లేదని, కొత్త సిరీస్‌పై తాము ఫోకస్ పెట్టినట్లు బుమ్రా తెలిపారు. కివీస్‌తో జరిగిన సిరీస్ నుంచి గుణపాఠాలు నేర్చుకున్నామని, కానీ ఆ పరిస్థితులు వేరన్నారు. ఆస్ట్రేలియాతో ఆడే తుది జట్టును కూడా ఫైనలైజ్ చేశామని, కానీ టాస్ సమయంలోనే జట్టు సభ్యుల వివరాలను వెల్లడించనున్నట్లు బుమ్రా తెలిపాడు.