Sukhjeet Singh | 2023 హాకీ వరల్డ్ కప్.. తొలిమ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం : సుఖ్జీత్
జనవరి 13న తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌తో తలపడనున్న భారత్
Sukhjeet Singh : కొత్త ఏడాదిలో భారత హాకీ జట్టుకు పెద్ద సవాల్ ఎదురుకానుంది. ఆస్ట్రేలియా సిరీస్‌లో పరాజయం తర్వాత స్వదేశంలో హాకీ వరల్డ్ కప్ ఆడనుంది. దాంతో, ఈ మెగా టోర్నీ కోసం జట్టంతా ఉత్సాహంగా ఎదురు చూస్తోందని భారత హాకీ ఫార్వర్డ్ ప్లేయర్ సుఖ్జీత్ సింగ్ అన్నాడు. ‘మా అందరిలో టీమ్ స్పిరిట్ ఉంది. వరల్డ్‌కప్‌లో స్పెయిన్‌తో జరిగే తొలి మ్యాచ్ కోసం మేమంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. జట్టులో ప్రతి ఒక్కరూ పాజిటివ్‌గా ఉన్నారు. అంతేకాదు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తున్నారు’ అంటూ సుఖ్జీత్ వెల్లడించాడు.
హాకీ వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. జనవరి 13 నుంచి 29 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. కప్పు కోసం మొత్తం 16 జట్లు పోటీపడనున్నాయి. టీమిండియా గ్రూప్ బిలో ఉంది. అందులో భారత్, స్పెయిన్, ఇంగ్లండ్, వేల్స్ జట్లు ఉన్నాయి. జనవరి 13న రూర్కెలాలో జరిగే మ్యాచ్‌లో టీమిండియా, స్పెయిన్‌తో తలపడనుంది. పోయిన ఏడాది ఆస్ట్రేలియా పర్యనకు వెళ్లిన భారత హాకీ జట్టు ఘోరంగా ఓడిపోయింది. ఐదు టెస్టుల హాకీ సిరీస్‌ను కోల్పోయింది. దాంతో, భారత హాకీ జట్టు స్వదేశంలో జరిగే వరల్డ్ కప్‌లో టైటిల్ సాధించాలనే కసితో ఉంది. కొత్త ఏడాదిని విజయంతో ఆరంభించాలని హాకీ ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

