Shikhar Dhawan | వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) భారత్-పాకిస్తాన్ మధ్య ఆదివారం జరిగాల్సిన మ్యాచ్ రద్దయ్యింది. ఈ మ్యాచ్‌లో ఆడేందుకు టీమిండియా మాజీ ప్లేయర్స్ ఆసక్తి చూపకపోవడం, టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో టోర్నీ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, పాక్‌తో మ్యాచ్ ఆడేది లేదని, తాను మే 11నే నిర్ణయం తీసుకున్నానని శిఖర్ ధావన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. యువరాజ్ సింగ్ నేతృత్వంలోని టీమిండియాకు ఈ టోర్నీలో ఇదే తొలి మ్యాచ్.
అయితే, తాను పాక్‌తో మ్యాచ్ ఆడబోనని.. విషయాన్ని టోర్నీ నిర్వాహకులకు చెప్పిటన్లు శిఖర్ ధావన్ స్పష్టం చేశారు. మే 11న లీగ్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లినట్లు మెయిల్ స్క్రీన్‌షాట్స్‌ను సైతం ధావన్ షేర్ చేశాడు. తాను ఈ లీగ్‌లో పాక్‌తో మ్యాచ్‌లో ఆడకూడదని మే 11న నిర్ణయం తీసుకున్నానని.. ఇంకా అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశాడు. తనకు తన దేశమే ముఖ్యమని.. దేశం కంటే ఏదీ ఎక్కువ కాదు.. జై హింద్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ ఆటగాళ్లు అందరూ ఈ టోర్నీలో ఆడుతున్నారు.
ఇంగ్లండ్ వేదికగా ఈ టోర్నీ జరుగుతున్నది. అయితే, పాక్‌తో ఎలాంటి మ్యాచులను ఆడకూడదని బీసీసీఐ ఇప్పటికే అల్టిమేటం జారీ చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. తాజాగా వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో తొలి మ్యాచ్ ఇరుజట్ల మధ్య ఆదివారం జరుగాల్సి ఉంది. అయితే, మ్యాచ్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే టోర్నీ నిర్వాహకులు మ్యాచ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణలు చెప్పారు. అయితే, మ్యాచ్‌లో ఇరు జట్లుకు చెరో పాయింట్ ఇచ్చారా? లేదా? అనే విషయంపై టోర్నీ నిర్వాహకులు క్లారిటీ ఇవ్వలేదు.
Jo kadam 11 May ko liya, uspe aaj bhi waise hi khada hoon. Mera desh mere liye sab kuch hai, aur desh se badhkar kuch nahi hota.
Jai Hind! 🇮🇳 pic.twitter.com/gLCwEXcrnR
— Shikhar Dhawan (@SDhawan25) July 19, 2025