WCL 2025 | వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడేందుకు భారత్ నిరాకరించింది. దాంతో టోర్నీ నిర్వాహకులు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు కెప్టెన్, మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది భారత్‌పై మరోసారి విషం కక్కే ప్రయత్నం చేశాడు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. ఆపరేషన్ సిందూర్‌తో ఆ దేశానికి వణుకు పుట్టించింది. ఆ తర్వాత దాయాది దేశంతో భారత్‌లోని సామాన్య ప్రజలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడ్డ విషయం తెలిసిందే.
భారత్ దాడులకు ధీటుగా బదులిచ్చింది. పాక్ పిరికిపంద చర్యకు నిరసనగా లెజెండ్స్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు నిరాకరించింది. కెప్టెన్ యువరాజ్ సింగ్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, శిఖర్ ధావన్ సహా పలువురు ఆటగాళ్లు పాక్‌తో మ్యాచ్ ఆడబోమని స్పష్టం చేయగా.. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. ఈ క్రమంలో డబ్ల్యూసీఎల్లో పాక్ కెప్టెన్ అఫ్రిది భారత్‌పై విషం కక్కుతూ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ రద్దయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ క్రికెట్‌ను రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పినా అన్ని రాజకీయ ప్రకటనలు చేయడం గమనార్హం.
తాము క్రికెట్ ఆడేందుకు వచ్చామని.. క్రికెట్‌ను రాజకీయాలకు దూరం పెట్టాలని తాను ఎప్పుడూ చెబుతుంటానని చెప్పుకొచ్చాడు. ఒక ఆట మంచి రాయబారిగా ఉండాలని.. తన దేశానికి ఇబ్బంది కలిగించడానికి కారణం కాదని పేర్కొన్నారు. భారత్‌కు ఆడడం ఇష్టం లేకపోతే ఇక్కడకు రావొద్దని.. ఇక్కడికి రాకముందు తిరస్కరించాల్సిందని చెప్పాడు. ఇక్కడికి వచ్చాక, ప్రాక్టీస్ సెషన్లు నిర్వహించాక అకస్మాత్తుగా ఒకే రోజులో అన్నింటిని మార్చారు అంటూ ఆరోపించారు. అయితే, వాస్తవానికి పాక్‌తో ఆడకూడదని మే 11న భారత్ నిర్వాహకులకు స్పష్టం చేసింది. ఈ విషయంలో ధావన్ టోర్నీ నిర్వాహకులకు సైతం సమాచారం ఇచ్చాడు.
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పాక్‌తో ఆడకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. క్రీడలు ప్రజలను దగ్గర చేస్తాయని, కానీ రాజకీయాలు ప్రతిదాంట్లో జోక్యం చేసుకుంటే ఎలా ముందుకెళ్తాం అని అఫ్రిది ప్రశ్నించాడు. కలిసి కూర్చొని సమస్యలపై చర్చించకపోతే ఏం మెరుగుపడదని.. కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల పరిస్థితులు మరింత దిగజారిపోతాయని చెప్పుకొచ్చాడు. ‘నా కారణంగా మ్యాచ్ ఆగిపోతుందని నాకు తెలిసి ఉంటే, నేను మైదానానికి కూడా వెళ్లను. కానీ, క్రికెట్ కొనసాగాలి. తనకు ఆట పెద్ద విషయమని.. అందులోకి రాజకీయాలు తీసుకురావడం.. భారత క్రికెటర్లు పాక్‌తో చెప్పడం కంటే బయట కూర్చోవాలంటూ నోరుపారేసుకున్నాడు.
If there hadn’t been a social media backlash, ‼️🚨
Remember, my friend, this match would still be happening.
I would like to request you all for
The same old Facebook trend on
X each repost equals a slap for Shahid Afridi.
Secondly, Shahid Afridi said something in this… pic.twitter.com/MErWmMUtOk— Akash Srivastava (@isrivastavas) July 21, 2025