అహ్మదాబాద్: భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య మరికాసేపట్లో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. దేశమంతటా క్రికెట్ గురించే జోరుగా చర్చ జరుగుతున్నది. ఎక్కడ నలుగురు గుమిగూడినా భారత్ గెలుస్తుందా..? ఆస్ట్రేలియా గెలుస్తుందా..? అన్న చర్చలే వినిపిస్తున్నాయి. క్రికెట్ ఫ్యాన్స్ టీవీల్లో మ్యాచ్ చూడటం కోసం ఇవాళ పనులన్నీ రద్దు చేసుకుని ఇండ్లకే పరిమితమయ్యారు. మరోవైపు ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు భారీ సంఖ్యలో అహ్మదాబాద్‌కు చేరుకున్నారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ప్రవేశ ద్వారాల దగ్గర అభిమానుల రద్దీ పెరిగిపోతున్నది. కాగా, భారత్ 2011 తర్వాత దాదాపు 12 ఏండ్లకు మళ్లీ ఫైనల్‌కు చేరింది. రెండోసారి వరల్డ్ కప్ గెలిచింది. అంతకుముందు 2003 ఫైనల్లో కూడా భారత్-ఆస్ట్రేలియా జట్లే తలపడ్డాయి. అయితే ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచి కప్‌ను ఎగరేసుకుపోయింది. ఇప్పుడు కప్ గెలిచి ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. స్టేడియంలో ఆవరణలో అభిమానుల రద్దీకి సంబంధించిన దృశ్యాలను మీరు ఈ కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.
| Gujarat: Visuals from Narendra Modi Stadium in Ahmedabad, where a large number of people have gathered to watch the ICC World Cup final between India and Australia. #ICCWorldCup2023 pic.twitter.com/K4xF4CXkav
— ANI (@ANI) November 19, 2023
#WATCH | Gujarat: A huge crowd gathered outside the entry gates of Narendra Modi Stadium in Ahmedabad ahead of the ICC Cricket World Cup final match between India and Australia.
#ICCMensCricketWorldCup2023 pic.twitter.com/TFZ1dcYh6F
— ANI (@ANI) November 19, 2023