UAE vs Oman : ఆసియా కప్‌లో భారత జట్టు చేతిలో దారుణ ఓటమి నుంచి తేరుకున్న యూఏఈ (UAE) బ్యాటర్లు దంచేశారు. సొంతగడ్డపై తమదైన ఆటతో ఒమన్ (Oman) బౌలర్లపై విరుచుకుపడి భారీ స్కోర్ అందించారు. కెప్టెన్ ముహమ్మద్ వసీం(69),ఓపెనర్ అలీఖాన్ షరాఫు(51)లు బౌండరీల మోతతో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించారు. పోటాపోటీగా ఆడిన ఇరువురు హాఫ్ సెంచరీలతో విజృంభించగా.. హర్షిత్ కౌశిక్(19) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. సారథి వసీం చివరి ఓవర్ వరకూ నిలబడడంతో యూఏఈ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.
స్వదేశంలో జరుగుతున్న ఆసియా కప్‌లో బోణీ కొట్టాలనే కసితో యూఏఈ బ్యాటర్లు చెలరేగారు. తొలి ఓవర్లో ఒకటే పరుగు వచ్చినా.. రెండో ఓవర్ నుంచి బౌండరీలతో దడ పుట్టించారు ఓపెనర్లు ముహమ్మద్ వసీం(69), అలీషాన్ షరాఫు(51)లు. అమీర్ ఖలీం వేసిన ఐదో ఓవర్లో వసీం మూడు ఫోర్లు బాదగా.. తానేమీ తక్కువా అన్నట్టు హస్నానీ షా బౌలింగ్‌లో షరాఫు హ్యాట్రిక్ బౌండరీలు కొట్టాడు. దాంతో.. పవర్ ప్లేలోనే యూఏఈ స్కోర్ 50కి చేరింది.
UAE end with 1️⃣7️⃣2️⃣ on the board.
A brilliant opening stand set the tone for things to come & handy cameos took 🇦🇪 to a solid total. Will Oman come out firing on all cylinders and record a handsome win?#UAEvOMAN #DPWorldAsiaCup2025 #ACC pic.twitter.com/GSxlCwggtN
— AsianCricketCouncil (@ACCMedia1) September 15, 2025
కాసేపటికే జితేన్ ఓవర్లో డబుల్స్ తీసి అర్ధ శతకం సాధించిన షరాఫ్ అదే ఓవర్లో బౌల్డ్ అయ్యాడు. అయినా సరే దూకుడు తగ్గించని వసీం.. శ్రీవాత్సవ ఓవర్లో సిక్సర్‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అసిఫ్ ఖాన్(2) నిరాశపరిచినా.. హర్షిత్ కౌశిక్(19) కెప్టెన్ వసీం జతగా దంచేశాడు. 19వ ఓవర్లో కౌశిక్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 18 రన్స్ పిండుకున్నాడు. ఆఖరి ఓవర్లో సిక్సర్‌తో జట్టు స్కోర్ 170 దాటించిన వసీం.. మూడో బంతికి ఔటయ్యాడు. దాంతో.. యూఏఈ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 172 రన్స్ చేయగలిగింది.