Jasprit Bumrah : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్టులో తొలిరోజు భారత జట్టు పైచేయి సాధించింది. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా(4/17) సంచలన బౌలింగ్‌తో ఆస్ట్రేలియా (Australia) నడ్డివిరిచి టీమిండియాను పోటీలోకి తెచ్చాడు. రోహిత్ శర్మ గైర్హాజరీలో కెప్టెన్సీ చేస్తున్న యార్కర్ కింగ్ అనుభవజ్ఞుడిలా జట్టును నడిపించాడు. ఏ మాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా బౌలింగ్ యూనిట్‌కు సమర్ధంగా నాయకత్వం వహించి ఆసీస్ బ్యాటర్లకు దిమ్మదిరిగి పోయేలా చేశాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 17 పరుగులకే 4 కీలక వికెట్లు తీసి తానొక చాంపియన్ బౌలర్ అని బుమ్రా మరోసారి నిరూపించుకున్నాడు. ఈ స్పీడ్‌స్టర్ ధాటికి టాపార్డర్, మిడిలార్డర్ కకావికలం కాగా కంగారూ జట్టు ఎదురీదుతోంది. మాజీ క్రికెటర్లు బుమ్రాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పాకిస్థాన్ దిగ్గజం వసీం అక్రమ్ అయితే.. బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అని మరోసారి కొనియాడాడు.
Pace bowlers from both attacks thoroughly dominated the opening day in favourable conditions at Optus Stadium https://t.co/uY60yyLJCf #AUSvIND pic.twitter.com/52vxKwgvT8
— ESPNcricinfo (@ESPNcricinfo) November 22, 2024
‘ప్రపంచ క్రికెట్ మూడు ఫార్మాట్లలో బుమ్రా బెస్ట్ బౌలర్. బంతిపై నియంత్రణ, స్వింగ్ రాబట్టడం, పేస్ తగ్గకుండా చూడడం.. క్రీజును అనుకూలంగా మలచుకోవడం.. రౌండ్ ది వికెట్ ద్వారా ఖవాజా వికెట్ తీయడం అద్భుతం. నా ఉద్దేశం ఏంటంటే.. చూస్తూ ఉండిపోవాలనిపించే తెలివైన బౌలర్ బుమ్రా. బ్యాటర్ల బలహీనతలను అతడు చాలా తొందరగా అర్ధం చేసుకున్నాడు. షార్ట్ బంతులు కొన్నే విసిరాడు. బంతిని రెండువైపులా స్వింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అందుకనే నాయకుడు ముందుండి నడిపిస్తున్నాడు అని చెబుతున్నా’ అని అక్రమ్ అన్నాడు.
పది మిల్లీమీటర్ల మందంతో పచ్చిక ఉన్న పెర్త్ మైదానంలో కంగారూ పేసర్లు రెచ్చిపోగా భారత స్టార్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. ఇక మళ్లీ భంగపాటు తప్పదా అనుకున్న దశలో అరంగేట్ర కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి(41 : 59 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
Nitish Reddy is looking like a million bucks on his debut Test match.#NitishKumarReddy #AUSvsIND #BGT2025pic.twitter.com/8mFEnSAnUI
— India Today Sports (@ITGDsports) November 22, 2024
రిషభ్ పంత్(37) జతగా జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అనంతరం భారీ స్కోర్ సాధించి టీమిండియాను ఒత్తిడిలో పడేయాలనుకున్న ఆస్ట్రేలియాకు బుమ్రా షాకిచ్చాడు. ఆదిలోనే ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(8), అరంగేట్రం చేసిన కుర్రాడు మెక్‌స్వీనే(10)లను ఔట్ చేశాడు.
India’s unstoppable pace phenom Jasprit Bumrah 👊🤩#AUSvIND #WTC25 pic.twitter.com/hjQcSCqdZE
— ICC (@ICC) November 22, 2024
19 పరుగులకే ఓపెనర్లు డగౌట్ చేరగా.. డేంజరస్ స్టీవ్ స్మిత్(0)ను బుమ్రా డకౌట్‌గా వెనక్కి పంపి ఆసీస్‌ను హడలెత్తించాడు. అదే ఊపులో కంగారూ సారథి ప్యాట్ కమిన్స్(3) వికెట్ కూడా ఖాతాలో వేసుకొని నాలుగో వికెట్ సాధించాడు బుమ్రా. దాంతో, ఆతిథ్య జట్టు తొలిరోజు ఆట ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో కమిన్స్ సేన 83 పరుగులు వెనకబడి ఉంది.