MIW vs GGW : మహిళల ప్రీమియర్ లీగ్‌లో భారీ స్కోర్లతో చెలరేగుతున్న గుజరాత్ జెయింట్స్ మూడో మ్యాచ్‌లో రెండొందలకు చేరువైంది. అలాఅనీ ఓపెనర్లు దంచేయలేదు. ముంబై ఇండియన్స్ బౌలర్ల ధాటికి 99కే నాలుగు వికెట్లు పడిన వేళ.. గుజరాత్ స్కోర్ 150 దాటడమే గగనం అనిపించింది. కానీ, డెత్ ఓవర్లలో జార్జియా వరేహం(43 నాటౌట్), భారతి ఫుల్మావి(36 నాటౌట్)లు విధ్వంసం సృష్టించారు. అమన్‌జోత్ కౌర్ వేసిన ఆఖరి ఓవర్లో రెచ్చిపోయిన భారతి.. 23 రన్స్ రాబట్టగా గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 192 పరుగులు చేయగలిగింది.
మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్లో గుజరాత్ జెయింట్స్ బ్యాటర్లు దూకుడు కొనసాగిస్తున్నారు. హ్యాట్రిక్‌పై కన్నేసిన గుజరాత్‌కు సమిష్టిగా రాణించి భారీ స్కోర్ అందించారు. భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్ సోఫీ డెవినె(8)ను షబ్నం ఇస్మాయిల్ ఔట్ చేసి ముంబైకి ఆదిలోనే బ్రేకిచ్చింది. మరో ఓపెనర్ బేత్ మూనీ(33), మిడిలార్డర్ కనికా ఆహుజా(35)తో కలిసి 42 రన్స్ జోడించింది.
Innovative ✨
And Powerful! 💥
An entertaining finish from Gujarat Giants! 🧡
Updates ▶️ https://t.co/Dxufu4Pisz
#TATAWPL | #KhelEmotionKa | #MIvGG | @Giant_Cricket pic.twitter.com/6U3TqM5tpD
— Women’s Premier League (WPL) (@wplt20) January 13, 2026
అయితే.. అమేలియా, మాథ్యూస్ ఓవర్లో వీరిద్దరూ ఔటయ్యాక.. కెప్టెన్ అషే గార్డ్నర్(20) వచ్చీ రావడమే దంచడం మొదలెట్టింది. డేంజరస్ గార్డ్నర్ను నికోలా క్యారీ ఎల్బీగా ఐట్ చేయగా.. గుజరాత్ కష్టాల్లో పడింది. అయితే.. జార్జియా వరేహం(43), భారతి ఫుల్మాలి(36) ధనాధన్ ఆటతో ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు. అమన్‌జోత్ వేసిన 20వ ఓవర్లో వరేహం 4, భారతి 4, 6, 6 బాది 23 రన్స్ పిండుకున్నారు. దాంతో.. గుజరాత్ ప్రత్యర్ధికి 193 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
Innings Break!
Crucial middle order contributions propel #GG to a commendable total 🧡
Can #MI chase it down? 🤔
Scorecard ▶️ https://t.co/Dxufu4Pisz #TATAWPL | #KhelEmotionKa | #MIvGG pic.twitter.com/cEWVsFuIFY
— Women’s Premier League (WPL) (@wplt20) January 13, 2026