హైదరాబాద్, ఆట ప్రతినిధి: భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న 39వ జాతీయ సబ్‌జూనియర్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పసిడి పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. టోర్నీలో తనకు ఎదురన్నది లేకుండా దూసుకెళుతున్న వ్రితి మరో రెండు విభాగాల్లో పసిడి పతకాలతో మెరిసింది.
శనివారం జరిగిన బాలికల 400మీటర్ల ఫ్రీస్టయిల్ రేసును వ్రితి 4:27:94సెకన్లలో ముగించి స్వర్ణాన్ని ఒడిసిపట్టుకుంది. బాలికల 200మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో వ్రితి పసిడి దక్కించుకుంది. ఇక బాలికల 100మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో రాష్ట్ర యువ స్విమ్మర్ శివానీ కర్రా రజతం ఖాతాలో వేసుకుంది.