చెన్నై: భారత చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఫిడేకు తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆనంద్.. ఈ ఏడాది సెప్టెంబర్ దాకా ఆ పదవిలో కొనసాగుతాడు.
ఫిడే అధ్యక్షుడిగా ఉన్న డ్వొర్కొవిచ్ (రష్యా)పై యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఆంక్షలు విధించడంతో ఆయన తన పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణ నేపథ్యంలో ఈయూ తాజాగా 48 మంది వ్యక్తులు, 170 సంస్థలపై ఆంక్షలు విధించింది. సెప్టెంబర్లో ఫిడే అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి.