Virat Kohli | దుబాయ్: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఐసీసీ ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కించుకున్నాడు. నిరుడు కోహ్లీ కనబర్చిన అద్భుత ప్రతిభకు ఐసీసీ ఈ పురస్కారం ప్రకటించింది. ఈ అవార్డు కోహ్లీని వరించడం ఇది నాలుగోసారి కాగా.. ఇదే అత్యధికం. నిరుడు కోహ్లీ వన్డేల్లో 1377 పరుగులు చేశాడు.
వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను దాటేసిన విరాట్.. ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన విషయం తెలిసిందే.