న్యూఢిల్లీ: ఇండియన్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli).. లండన్‌లో స్థిరపడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇటీవల కాలంలో ఎక్కువ సమయం కోహ్లీ లండన్‌లోనే గడిపాడు. ఇండియా నుంచి అతను తన బేస్‌ను త్వరలో మార్చనున్నట్లు చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ తెలిపారు. భార్య అనుష్కా శర్మ, పిల్లలతో కలిసి అతను లండన్ సెటిలవ్వలనుకుంటున్నాడు. అనుష్కా రెండో సారి ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆమె కోసం కోహ్లీ అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు.
విరాట్, అనుష్కా దంపతులకు లండన్‌లో ప్రాపర్టీ ఉన్నది. అక్కడే వాళ్లు ఎక్కువగా కాలం గడుపుతున్నారు. అకాయ్ పుట్టిన తర్వాత సమయాన్ని గడిపేస్తున్నారు. అయితే పర్మనెంట్‌గా లండన్‌కు వెళ్లిపోవాలన్న ఆలోచనలో కోహ్లీ ఉన్నట్లు తెలుస్తోంది. భార్యా, పిల్లలతో కలిసి అతను లండన్‌కు వెళ్లే ఆలోచనలో ఉన్నాడని రాజ్‌కుమార్ తెలిపారు.త్వరలోనే అతను ఇండియాను వదిలి వెళ్లనున్నట్లు చెప్పాడు.
36 ఏళ్ల కోహ్లీ ఇప్పటికే టీ20 మ్యాచ్‌లకు గుడ్‌బై చెప్పేశాడు. అయితే టెస్టులు, వన్డేలకు ఇంకెంత కాలం అతను ఆడుతాడన్న అంశాన్ని చెప్పలేమన్నారు.