బెంగళూరు : ఐపీఎల్లో పరుగులబాట పట్టిన కింగ్ కోహ్లీ తన కూతురితో సరదాగా ఈత కొలనువద్ద సేదదీరిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఓటమినుంచి సేదదీరేందుకు కోహ్లీ ఈత కొలనువద్ద తన కూతురు వామికతో సమయం గడిపాడు. స్విమ్మింగ్ పూల్ గట్టుపై కూతురుతో కలిసి దిగిన ఫొటోను కోహ్లీ షేర్ చేశాడు.