మెల్బోర్న్: ఆస్ట్రేలియా యువ బ్యాటర్ సామ్ కొన్‌స్టాస్‌ను.. ఇండియన్ ఫీల్డర్ విరాట్ కోహ్లీ(Kohli-Konstas) భుజంతో ఢీకొట్టాడు. మెల్బోర్న్ టెస్టులో ఈ ఘటన చోటుచేసుకున్నది. తొలి టెస్టు ఆడుతున్న కొన్‌స్టాస్.. 60 రన్స్ చేసి ఔటయ్యాడు. అయితే తొలుత బుమ్రాతో పాటు ఇతర బౌలర్లను చాలా ఈజీగా ఎదుర్కొన్నాడతను. ఇక అతన్ని ఔట్ చేసేందుకు ప్లేయర్లు అనేక ట్రిక్కులు ప్లే చేశారు. ఓ దశలో కొన్‌స్టాస్‌ను కావాలనే కోహ్లీ ఢీకొట్టినట్లు అనిపించింది. క్రీజ్‌పై ఎదురెదురుగా వెళ్తున్న ఇద్దరు.. ఒకర్ని ఒకరు ఢీకొన్నారు. కోహ్లీ భుజం ఢీకొనడంతో.. కొన్‌స్టాస్ వెనక్కి తిరిగి చూసి వాగ్వాదానికి దిగాడు. గ్రౌండ్ మధ్యలో గొడవ స్టార్ట్ కావడంతో.. మరో బ్యాటర్ ఖవాజా వచ్చి కోహ్లీపై చేయి వేసి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశాడు.
Kohli and Konstas come together and make contact 👀#AUSvIND pic.twitter.com/adb09clEqd
— 7Cricket (@7Cricket) December 26, 2024
యువ బ్యాటర్‌ను భుజంతో ఢీకొట్టిన ఘటన పట్ల సీనియర్ మాజీ క్రికెటర్లు స్పందించారు. కోహ్లీపై ఐసీసీ చర్యలు తీసుకోవాలని రికీ పాంటింగ్, మైఖేల్ వాన్ లాంటి ఆటగాళ్లు డిమాండ్ చేశారు. ఈ ఘటన పట్ల ఐసీసీ సమీక్ష నిర్వహిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు .. కోహ్లీ, కొన్‌స్టాస్ ఘటనపై చర్యలు తీసుకోవాలని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. కుడి వైపు వెళ్లి మరీ కొన్‌స్టాస్‌ను రెచ్చగొట్టినట్లు పాంటింగ్ తెలిపాడు. 19 ఏళ్ల ఆసీస్ బ్యాటర్‌ను పాంటింగ్ సమర్థించుకున్నాడు. భుజంతో నెట్టిన కోహ్లీని అతనేమీ చేయలేకపోయినట్లు చెప్పాడు. ఈ ఘటన విషయంలో మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకోవాలని మైఖేల్ వాన్ తెలిపారు.