Virat Kohli : భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) ఫిట్నెస్ ఫ్రీక్ అని తెలిసిందే. సమయం దొరికితే చాలు వర్కవుట్ వీడియోలతో అభిమానులను ఫిదా చేస్తుంటాడు. అందుకనే విరాట్ తన ఫిట్నెస్తో ఈతరం క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచాడు. ప్రపంచంలోనే మేటి క్రికెటర్లలో ఒకడైన అతను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త వర్కవుట్ వీడియో పోస్ట్ చేశాడు. అందులో గులాబీ రంగు టీ షర్ట్, తెలుపు రంగు షార్ట్ వేసుకున్న కింగ్ కోహ్లీ డంబెల్స్‌తో ఎక్సర్సైజ్ చేస్తూ కనిపించాడు.
ఆ వీడియోకు ‘సాకుల కోసం వెతకండి లేదా మెరుగవ్వడానికి ప్రయత్నించండి’ అంటూ క్యాప్షన్ రాశాడు. ప్రస్తుతం కోహ్లీ వర్కవుట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మరుసటి రోజు కోహ్లీ , భార్య అనుష్కా శర్మతో కలిసి లండన్‌లోని ఉన్నకృష్ణదాస్ కీర్తనలు విన్నాడు. వాళ్లిద్దరూ బెంచీ మీద కూర్చొని కీర్తనలు వింటున్న ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి.
గత ఏడాది ఫామ్ అందుకున్న కోహ్లీ సెంచరీల మోత మోగించాడు. టీ20, వన్డే, టెస్టుల్లో శతకాలతో మునపటి విరాట్‌ను గుర్తు చేశాడు. ఐపీఎల్ 16వ సీజన్లోనూ అతను వరుసగా రెండు సెంచరీలతో ఔరా అనిపించాడు. దాంతో, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ కోహ్లీ అదే జోరు కొనసాగిస్తాడనుకున్నారంతా. కానీ, తొలి ఇన్నింగ్స్‌లో(14) విఫలమయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ 49 పరుగులతో రాణించాడు. అజింక్యా రహానే(46)తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే.. ఓటమిని మాత్రం తప్పించలేకపోయాడు. స్లిప్‌లో స్టీవ్ స్మిత్ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో అతను వెనుదిరిగాడు. ఆ వెంటనే మిచెల్ స్టార్క్ రహానేను ఔట్ చేశాడు. దాంతో, భారత జట్టు 209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాకు భంగపాటు ఎదురైంది.