Avesh Khan | ఆరోజు హెల్మెట్‌ను నేలకేసి కొట్టినందుకు బాధపడుతున్నా : అవేశ్ ఖాన్
Avesh Khan : ఐపీఎల్ 16వ సీజన్లో హోరాహోరీ పోరాటాలు, ఆఖరి ఓవర్ ఉత్కంఠ అభిమానులకు కిక్ ఇచ్చాయి. అయితే.. లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్లు తలపడిన 15వ మ్యాచ్‌ను అభిమానులు మర్చిపోలేరు. ఈ మ్యాచ్‌లో లక్నో పేసర్ అవేశ్ ఖాన్(Avesh Khan) హెల్మెట్‌ను నేలకేసి కొట్టి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఆరోజు తాను అలా చేసినందుకు...
Avesh Khan : ఐపీఎల్ 16వ సీజన్లో హోరాహోరీ పోరాటాలు, ఆఖరి ఓవర్ ఉత్కంఠ అభిమానులకు కిక్ ఇచ్చాయి. అయితే.. లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్లు తలపడిన 15వ మ్యాచ్‌ను అభిమానులు మర్చిపోలేరు. ఈ మ్యాచ్‌లో లక్నో పేసర్ అవేశ్ ఖాన్(Avesh Khan) హెల్మెట్‌ను నేలకేసి కొట్టి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఐపీఎల్ నియమావళి(IPL Code Of Conduct)ని ఉల్లంఘించిన అతను తాజాగా ఆ సంఘటనపై స్పందించాడు. ఆరోజు తాను అలా చేసినందుకు బాధపడుతున్నానని అవేశ్ అన్నాడు.
‘హెల్మెట్‌ను నేలకేసి కొట్టి ఎక్కువ చేశాను. అయితే.. ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సింది. 16వ సీజన్‌కు ముందు రెండు సీజనల్లో నేను నా స్టయిల్లో ఆడాను. ఎకానమీ 10లోపు ఉండేలా చూసుకున్నా’ అని అవేశ్ ఖాన్ తెలిపాడు. ఈ సీజన్లో ఈ స్పీడ్‌స్టర్ 18 వికెట్లతో ఆకట్టుకున్నాడు.
చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(61), ఫాఫ్ డూప్లెసిస్(79), గ్లెన్ మ్యాక్స్‌వెల్(59) అర్ధ శతకాలతో చెలరేగారు. దాంతో, ఆర్సీబీ.. లక్నోకు 213 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కొండంత టార్గెట్ ఛేదనలో.. మార్కస్ స్టోయినిస్(65), నికోలస్ పూరన్(62) దంచి కొట్టారు. పూరన్ కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో మ్యాచ్‌ను లక్నో వైపు తిప్పాడు.
ఆఖరి ఓవర్లో ఉత్కంఠ
అయితే.. హర్షల్ పటేల్(Harshal Patel) వేసిన ఆఖరి ఓవర్లో ఉత్కంఠ నెలకొంది. రెండో బంతికి మార్క్‌వుడ్ బౌల్డయ్యాడు. ఐదో బంతికి జయదేవ్ ఉనాద్కాట్ ఔటయ్యాడు. దాంతో, ఆఖరి బంతికి లక్నో విజయానికి ఒక్క పరుగు కావాలి. క్రీజులో ఉన్న అవేశ్ ఖాన్ సింగిల్ తీయడంతో లక్నో ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. సింగిల్ తీశాక అవేశ్ ఆవేశంతో హెల్మెట్‌ను నేలకేసి కొట్టాడు. గాల్లోకి పంచ్‌లు విసిరి సంబురాలు చేసుకున్నాడు. ఇరుజట్లు రెండోసారి తలపడిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు గెలిచింది. మ్యాచ్ అనంతరం కోహ్లీ, లక్నో హెడ్‌కోచ్, నవీన్ ఉల్ హక్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్లే ఆఫ్స్ చేరిన లక్నో జట్టు ముంబై ఇండియన్స్(Mumbai Indians) చేతిలో చిత్తుగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఇవి కూడా చదవండి
Asian Fencing Championships | చరిత్ర సృష్టించిన భవానీ దేవి.. సెమీ ఫైనల్ చేరిన తొలి భారత ఫెన్సర్‌గా రికార్డు
UEFA Nations League | షూటౌట్లో స్పెయిన్ విజయం.. 11 ఏళ్లకు మెగా ట్రోఫీ కల సాకారం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

