మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Nov 04, 2020 , 21:02:04

కోహ్లీ, రోహిత్‌కు చేరువలో పాక్‌ బాబర్‌ ఆజమ్‌

కోహ్లీ, రోహిత్‌కు చేరువలో పాక్‌ బాబర్‌ ఆజమ్‌

ముంబై : పాకిస్తాన్, జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్ ముగిసిన నేపథ్యంలో బుధవారం తాజా ర్యాంకులను ఐసీసీ విడుదల చేసింది. వన్డే ర్యాంకింగ్స్‌లో స్టార్ ఇండియన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ మొదటి, రెండు స్థానాలను నిలబెట్టుకున్నారు. పాకిస్తాన్ ఆల్ రౌండర్ ఇమాద్ వసీమ్ మూడు స్థానాలు సంపాదించి 49 వ స్థానానికి చేరుకున్నాడు. మంగళవారం సాయంత్రం జరిగిన మూడో మ్యాచ్‌లో 125 పరుగులు చేసిన బాబర్ మొత్తం 221 పరుగులు చేసి ఎనిమిది పాయింట్లు సాధించి మూడవ స్థానంలో ఉన్నారు. బాబర్‌ ఆజమ్. రోహిత్‌ శర్మ కంటే 18 పాయింట్లు.. విరాట్‌ కోహ్లీ కంటే 34 పాయింట్లు వెనుకబడి ఉన్నాడు. 

జింబాబ్వే తరఫున బ్రెండన్ టేలర్, సీన్ విలియమ్స్ ఈ సిరీస్‌లో చక్కటి సెంచరీలు సాధించిన తరువాత బ్యాట్స్‌మెన్‌లలో ముందుకు వచ్చారు. తొలి మ్యాచ్‌లో 112 పరుగులతో మొత్తం 204 పరుగులు చేసిన టేలర్ 42 వ స్థానానికి చేరుకోగా.. ఫైనల్ మ్యాచ్‌లో అజేయంగా 118 పరుగులతో మొత్తం 197 పరుగులతో విలియమ్స్ 12 స్థానాలు ఎగబాకి 46 వ స్థానానికి చేరుకున్నాడు. మూడో స్థానంలో ఉన్న బాబర్‌ ఆజమ్‌ తర్వాత వరుసగా.. రాబర్ టేలర్, ఫాఫ్ డు ప్లెసిస్, కేన్ విలియమ్సన్, ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, క్వింటన్ డి కాక్, జానీ బెయిర్‌స్టో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

బౌలర్ల జాబితాలో, న్యూజిలాండ్ పేస్ స్పియర్ హెడ్ ట్రెంట్ బౌల్ట్ అగ్రస్థానంలో నిలిచాడు. భారతదేశానికి చెందిన జస్ప్రీత్ బుమ్రా రెండో స్థానంలో కొనసాగుతున్నారు. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది ర్యాంకింగ్స్‌లో కెరీర్‌లో అత్యుత్తమ 16 వ స్థానాన్ని సాధించాడు. రావల్పిండిలో సిరీస్ ప్రారంభ వన్డేలో 5/49 మ్యాచ్ విన్నింగ్‌తో షాహీన్ తన కెరీర్లో మొదటిసారి టాప్ 20 లోకి ఎనిమిది స్థానాలు సంపాదించాడు. మరో పాక్‌ బౌలర్‌ వహాబ్ రియాజ్ సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో 4/41 పరుగులతో రెండు మ్యాచ్‌ల్లో మొత్తం ఐదు వికెట్లు పడగొట్టి 60 వ స్థానానికి చేరుకున్నాడు.

ఆల్‌రౌండర్‌ షకీబ్ అల్ హసన్

షకీబ్ అల్ హసన్ రెండేండ్ల నిషేధం అక్టోబర్ 29 తో ముగిసింది. మాజీ బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్‌ అల్‌ హసన్‌.. ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. షాకిబ్ ర్యాంకింగ్స్‌లో తిరిగి చేర్చబడిన తరువాత ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ మొహమ్మద్ నబీ 301 రేటింగ్ పాయింట్లతో రెండవ స్థానానికి పడిపోయాడు. క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్ వరుసగా 3, 4 స్థానాలను ఆక్రమించారు. జాబితాలో ఉన్న ఏకైక భారతీయుడు రవీంద్ర జడేజా 9 వ పొజీషన్‌లో ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.