Loksabha Elections 2024 | అధికారం చేపట్టగానే అగ్నివీర్ స్కీమ్ రద్దు : తేజస్వి యాదవ్
లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి విజయం ధించి అధికార పగ్గాలు చేపడితే అగ్నివీర్ స్కీమ్‌ను రద్దు చేస్తామని ఆర్జేడీ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ స్పష్టం చేశారు.
Loksabha Elections 2024 | లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి విజయం ధించి అధికార పగ్గాలు చేపడితే అగ్నివీర్ స్కీమ్‌ను రద్దు చేస్తామని ఆర్జేడీ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ స్పష్టం చేశారు. అగ్నివీర్ పధకం కేవలం నాలుగేండ్ల వ్యవధే కావడంతో ఎక్కువ సమయం శిక్షణకే సరిపోతుందని అన్నారు.
అగ్నివీర్లో అమరవీరుల హోదా లేదని, క్యాంటిన్ సదుపాయం లేదని, పెన్షన్ కూడా లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే ఏమాత్రం ప్రయోజనం లేని అగ్నివీర్ పధకాన్ని రద్దు చేస్తామని చెప్పారు. సైనిక నియామకాల్లో పాత పద్ధతినే ముందుకు తీసుకువెళతామనితేజస్వి యాదవ్ తేల్చిచెప్పారు.
ఇక సైనిక నియామకాలకు ఉద్దేశించిన అగ్నివీర్ స్కీమ్‌ను రద్దు చేస్తామని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సైతం ఇటీవల హామీ ఇచ్చారు. గౌతంబుద్ధనగర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అఖిలేష్ మాట్లాడుతూ అగ్నివీర్ స్కీమ్‌పై యువత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తమ కూటమి అధికారంలోకి రాగానే అగ్నివీర్‌ను రద్దుచేస్తామని పేర్కొన్నారు.
Read More :
Gold rate | పసిడి పరుగుకు బ్రేక్.. రూ.72,200 కు దిగొచ్చిన ధర
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

