Virat Kohli : ఐపీఎల్ ప్రతి సీజన్లో ‘ఈసాలా కప్ నమదే’ అనేది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) లక్ష్యంగా ఉండేది. ఆరంభ సీజన్ నుంచి 17వ ఎడిషన్ వరకూ మూడు సార్లు ఫైనల్ చేరినా ఆర్సీబీని ఓటమే పలకరించింది. కానీ, పద్దెనిమిదో సీజన్లో బెంగళూరు కల సాకారమైంది. ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణలకు తెరదించుతూ నిరుడు జూన్ 3వ తేదీన ఐపీఎల్ ట్రోఫీని ఒడిసిపట్టింది బెంగళూరు. ఏళ్ల ఎదురుచూపు ఫలించిన వేళ.. భావోద్వేగానికి లోనైన విరాట్ కోహ్లీ (Virat Kohli) పంతొమ్మిదో సీజన్ సమీపిస్తున్న వేళ తమ జట్టు గెలుపు సంబురాలను ఓసారి గుర్తు చేసుకున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో స్టార్ ఆటగాళ్లకు కొదవలేని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18వ సీజన్లో విజేతగా అవతరించింది. ఐపీఎల్ ఆరంభం నుంచి జట్టుతో కొనసాగుతున్న విరాట్ కోహ్లీ బ్యాటింగ్ విన్యాసాలకు తోడు బౌలర్ల శ్రమ ఫలితంగా ఆర్సీబీ కల నిజమైంది. నిరుడు జూన్ 3న ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌పై 6 పరుగుల తేడాతో గెలిచిన రజత్ పాటిదార్ సేన తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఆ రోజు తనకెంతో ప్రత్యేకమని చెబుతున్న కోహ్లీ ఆర్సీబీ విజయంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
𝙍𝘾𝘽 𝙁𝙖𝙢, 𝙮𝙤𝙪’𝙧𝙚 𝙣𝙤𝙩 𝙧𝙚𝙖𝙙𝙮 𝙛𝙤𝙧 𝙩𝙝𝙞𝙨… 🥹⭐🏆
Virat reflects on the night of the #IPL2025 Final and what it truly means to be an IPL champion. ❤️#PlayBold #ನಮ್ಮRCB #IPL2026 pic.twitter.com/ZD0v8JCesj
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 22, 2026
‘ఆర్సీబీ ఆటగాళ్లకు, ఫ్రాంచైజీకి, అభిమానులకు జూన్ 3 రాత్రి ఎంతో ప్రత్యేకం. ఐపీఎల్ మొదటి రోజు నుంచి నేను, రమేశ్ మనే(టీమ్ కేర్ టేకర్) బెంగళూరుతో ఉన్నాం. ఆర్సీబీ గ్రూప్‌లో మేమే అందరికంటే పాత సభ్యులం. పద్దెనిమిదో సీజన్లో ఫైనల్ చేరాక నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. కానీ, విజయం అంత తేలిక కాదని తెలుసు. ఎందుకుంటే.. లీగ్ ఆసాంతం గొప్పగా ఆడిన పంజాబ్ కింగ్స్‌తో ఫైనల్. బలమైన జట్లను ఓడించి ఫైనల్‌కు దూసుకొచ్చిన ఆ టీమ్ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంది. గతంలో మూడుసార్లు మేము ట్రోఫీకి దగ్గరగా వచ్చాం. కానీ, విజేతలం కాలేదు. చెప్పాలంటే ఆ ఓటములే మాలో ఈసారి గెలిచి తీరాల్సిందేనన్న కసిని రగిల్చాయి. లీగ్ దశ నుంచి మంచి క్రికెట్ ఆడి మేము ఫైనల్ చేరాం. పటిష్టమైన జట్లను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించాం.
Kuch kiya hai ❌
Bohot kuch kiya hai ✅Captain Patidar reacts to the upgraded crest… the star that hits different. 🥹⭐#PlayBold #ನಮ್ಮRCB #IPL2026 pic.twitter.com/X0UpkV5tZQ
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 22, 2026
అందుకే.. ఆరోజు రాత్రి చాలా అద్భతుమైనది. ఫైనల్లో గెలిచిన క్షణం నేను చాలా సంతోషించాను. ఆర్సీబీతో నా పద్దెనిమిదేళ్ల ప్రయాణం ఒక్కసారిగా కళ్లముందు మెదిలింది. మంచి సందర్భాలతో పాటు చెడు సంఘటనలు గుర్తుకొచ్చాయి. అప్పుడు భావోద్వేగాలను మాటల్లో చెప్పడం కష్టమనిపించింది. విజేత ఎవరో తేల్చే చివరి ఓవర్ అందరిలో ఉత్కంఠ రేపింది. అయితే.. ఎన్నడూ నో బాల్ వేయని జోష్ హేజిల్‌వుడ్ ఈసారి కూడా నో బాల్ వేయడని నా గట్టి నమ్మకం. అతడిపై నమ్మకం ఉన్నా.. అనుకున్న ఫలితం రావాలిగా. అప్పటికే మ్యాచ్ మావైపు మొగ్గింది. అయినా సరే చివరి మూడు బంతుల వరకూ ఎదురుచూశాం. ఆఖరి ఓవర్ ఆ రాత్రి అత్యంత కఠినమైన భాగం’ అని విరాట్ ఆర్సీబీ ఐపీఎల్ విజేతగా నిలిచిన క్షణాలను యాది చేసుకున్నాడు.