Virat Kohli | టీమిండియా సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ సిద్ధమయ్యాడా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలియజేశాడు. బోర్డు అంగీకరించలేదని తెలుస్తున్నది. తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. త్వరలోనే ఇంగ్లాండ్‌తో కీలక సిరీస్ జరుగనుంది. 2025-27 ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ సైకిల్ టీమిండియా ఈ సిరీస్‌తో మొదలుపెట్టనున్నది. ఇప్పటికే రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అనూహ్యంగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. ఇంగ్లాండ్ పర్యటనలో జట్టుకు మార్గదర్శకత్వం చేసేందుకు సీనియర్లు ఎవరూ లేకపోవడంతో విరాట్‌ను తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని బీసీసీఐ కోరినట్లు తెలుస్తున్నది. అయితే, విరాట్ తన నిర్ణయాన్ని మార్చుకోకపేతో భారత క్రికెట్లో మరో అధ్యాయం ముగియనున్నది. ఇక టెస్టుల్లో విరాట్ రికార్డుల విషయానికి వస్తే.. కోహ్లీ ఇప్పటి వరకు 123 మ్యాచులు ఆడాడు. 210 ఇన్నింగ్స్‌లో 55.57 సగటుతో 9,230 పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యధిక స్కోర్ 254 నాటౌట్. ఇందులో 30 సెంచరీలు, 51 హాఫ్ సెంచరీలున్నాయి.
టెస్టుల్లో 5వేల పరుగులు చేసిన, ఫీల్డింగ్ సమయంలో 50 కంటే ఎక్కువ క్యాచ్‌లు పట్టిన ఆటగాడు విరాట్ కోహ్లీ. 123 టెస్టుల్లో 42.30 సగటుతో 9230 పరుగులు చేశాడు. ఫీల్డింగ్ సమయంలో 121 క్యాచులు అందుకున్నాడు. కోహ్లీతో పాటు ఈ ఘనత సాధించిన టీమిండియా ప్లేయర్లలో గుండప్ప విశ్వనాథ్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, కపిల్ దేవ్, మొహమ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానే ఉన్నారు.
టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన రికార్డు కోహ్లీ పేరిత ఉన్నది. 2014లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో 11 పరుగులు చేసిన విరాట్.. రెండో ఇన్నింగ్స్‌లో 141 పరుగులు చేశాడు. కోహ్లీతో పాటు ఈ జాబితాలో భారత జట్టుకు చెందిన విజయ్ హజారే, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, అజింక్య రహానే, రోహిత్ శర్మ ఉన్నారు.
ఒక టెస్ట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి, మరో ఇన్నింగ్స్‌లో 90 పరుగులు చేసిన అవుట్ అయిన కొద్దిమంది ప్లేయర్లలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. రెండుసార్లు తొలి ఇన్నింగ్‌లో సెంచరీ చేసి.. రెండో ఇన్నింగ్‌లో 90 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. 2013లో దక్షిణాఫ్రికాతో జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 119 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 96 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 2018లో నాటింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో 97 పరుగులు, ఇన్నింగ్స్‌లో 103 పరుగులు చేశాడు. కోహ్లీతో పాటు చందు బోర్డే, మోహిందర్ అమర్నాథ్, సౌరవ్ గంగూలీ, గౌతమ్ గంభీర్, చతేశ్వర్ పుజారా ఈ జాబితాలో ఉన్నారు.
టెస్టుల్లో ఓ విరాట్‌కు ఓ చెత్త రికార్డు ఉన్నది. టెస్టు మ్యాచ్‌లో ఇక ఇన్నింగ్‌లో సెంచరీ చేసి.. మరో ఇన్నింగ్‌లో డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ సైతం ఉన్నాడు. 2017లో విరాట్ ఇలా అవుట్ అయ్యాడు. ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకతో జరిగిన టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఖాతా తెరవలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 104 పరుగులు చేశాడు. ఇలా అవుట్ అయిన భారత బ్యాట్స్మెన్లలో హిమ్మత్‌లాల్ మన్కడ్ (వినూ మన్కడ్), పంకజ్ రాయ్, విజయ్ లక్ష్మణ్ మంజ్రేకర్, మాధవ్ లక్ష్మణ్‌రావ్ ఆప్టే, గుండప్ప విశ్వనాథ్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, నవజోత్ సిద్ధు, మహ్మద్ అజారుద్దీన్, నయన్ మోంగియా, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, శిఖర్ ధావన్, చతేశ్వర్ పుజారా, శుభ్‌మాన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్ ఉన్నారు.
భారత్ తరఫున తరఫున టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన రికార్డు కోహ్లీ పేరిట ఉంది. ఏడు డబుల్ సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో విరాట్ నాలుగో స్థానంలో ఉన్నాడు. సర్ డాన్ బ్రాడ్‌మాన్ టెస్ట్‌లలో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన రికార్డు ఉంది. ఆయన 12 డబుల్ సెంచరీలు చేశాడు. ఆ తర్వాత శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర, వెస్టిండిస్ దిగ్గజం బ్రియాన్ లారా, టీమిండియా డేరింగ్ అండ్ డాషింగ్ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నారు. సెహ్వాగ్ టెస్టుల్లో ఆరు డబుల్ సెంచరీలు చేశాడు.
భారత్ తరపున ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన రికార్డు కోహ్లీ పేరిట ఉంది. 2017-18లో శ్రీలంకతో జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌లో ఐదు ఇన్నింగ్స్‌లలో రెండు డబుల్ సెంచరీలు చేశాడు. శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటించింది. ఈ సిరీస్‌లో కోహ్లీ 610 పరుగులు చేశాడు. శ్రీలంకతో జరిగిన నాగ్‌పూర్ టెస్ట్‌లో 213 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఢిల్లీలో 243 పరుగులు చేశాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-0తో గెలుచుకుంది. ఈ జాబితాలో కోహ్లీ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. బ్రాడ్‌మాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఒక సిరీస్‌లో అత్యధికంగా మూడు డబుల్ సెంచరీలు చేసిన రికార్డు బ్రాడ్‌మాన్ పేరిట ఉంది.
భారత్ తరపున టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును కోహ్లీ సొంతం. సునీల్ గవాస్కర్ రికార్డును విరాట్ సమం చేశాడు. గవాస్కర్, కోహ్లీ ఇద్దరూ ఒకే సిరీస్‌లో నాలుగు సెంచరీలు చేసిన రికార్డు ఉంది. 2014-15లో ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఈ సిరీస్‌లోని నాలుగు మ్యాచ్‌లలో ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 692 పరుగులు చేశాడు. అడిలైడ్‌లో 115 పరుగులు.. 141 పరుగులు చేశాడు. మెల్బోర్న్లో 169 పరుగులు, సిడ్నీలో 147 పరుగులు చేశాడు. మరో వైపు సునీల్ గవాస్కర్ 1970-71 వెస్టిండీస్ పర్యటనలో ఈ ఘన సాధించాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్లైడ్ లియోపోల్డ్ వాల్కాట్ ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆయన ఐదు సెంచరీలు చేశాడు.