ఢిల్లీ: భారత టెస్టు క్రికెట్లో ఆటగాడిగానే గాక సారథిగానూ తనదైన ముద్రవేసిన విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. ఇటీవల కాలంలో టెస్టుల్లో భారత ప్రదర్శన దిగజారుతున్న నేపథ్యంలో కోహ్లీ మళ్లీ టెస్టుల్లో పునరాగమనం చేయాలని చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.
ఢిల్లీలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. టెస్టుల్లో కోహ్లీ చేసిన పరుగుల (9,230) మాదిరిగానే ఈ బ్రాండ్‌లోని ఒక షూ ధర రూ. 9,230గా నిర్ణయించగా యాంకర్ స్పందిస్తూ.. ‘మీరు టెస్టుల్లోకి వచ్చి ఈ షూ ధరను మరింత పెంచొచ్చు కదా’ అని ప్రశ్నించాడు. దానికి రన్మిషీన్ స్పందిస్తూ.. ‘లేదు. నేను వాటిని తక్కువ ధరకు అమ్మడానికే ఇష్టపడుతాను. ఇక అది (టెస్టుల్లోకి రీఎంట్రీపై) ముగిసిన అధ్యాయం’ అని తన మనసులో మాట చెప్పేశాడు.