Virat Kohli | నేపాల్ క్రికెటర్‌తో విరాట్ కోహ్లీ ఫన్నీ కామెంట్..
Virat Kohli | నేపాల్ ఓపెనింగ్ బ్యాటర్ ఆసిఫ్ షేక్‌తో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ జోకింగ్ కామెంట్ చేశాడు. ఈ విషయాన్ని తాజాగా ఆసిఫ్ వెల్లడించాడు. భారత్‌తో మ్యాచ్ అనంతరం నేపాల్ క్రికెటర్లలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి గౌరవంగా మెడల్స్ అందజేశారని, తన మెడలో విరాట్ కోహ్లీ మెడల్ వేశాడని, కోహ్లీ చేతుల మీదుగా మెడల్ స్వీకరించడం ఆనందంగా ఉందని ఆసిఫ్ చెప్పాడు.
కొలంబో: నేపాల్ ఓపెనింగ్ బ్యాటర్ ఆసిఫ్ షేక్‌తో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫన్నీ కామెంట్ చేశాడు. ఈ విషయాన్ని తాజాగా ఆసిఫ్ వెల్లడించాడు. భారత్‌తో మ్యాచ్ అనంతరం నేపాల్ క్రికెటర్లలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి గౌరవంగా మెడల్స్ అందజేశారని, తన మెడలో విరాట్ కోహ్లీ మెడల్ వేశాడని, కోహ్లీ చేతుల మీదుగా మెడల్ స్వీకరించడం ఆనందంగా ఉందని ఆసిఫ్ చెప్పాడు. మెడల్ మెడలో వేస్తూ కోహ్లీ ఓ ఫన్నీగా కామెంట్ చేశాడని, ‘నీ క్యాచ్‌ను విడిచి పెట్టినందుకు నాక్కూడా మెడల్ ఇవ్వాలి’ అన్నాడని పేర్కొన్నాడు.
ఆసియా కప్-2023లో భాగంగా భారత్-నేపాల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. నేపాల్ ఓపెనర్ ఆసిఫ్ షేక్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను వదిలేశాడు. ఆ క్యాచ్‌ను కోహ్లీ పట్టి ఉంటే రెండో ఓవర్లోనే పెవిలియన్‌కు చేరాల్సిన ఆసిఫ్.. లైఫ్‌లైన్‌ను వినియోగించుకుని హాఫ్ సెంచరీ కొట్టాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం ఆసిఫ్‌కు కోహ్లీ మెడల్ ప్రదానం చేస్తూ.. ‘నీ క్యాచ్‌ను విడిచి పెట్టినందుకు నాక్కూడా మెడల్ ఇవ్వాలి’ అంటూ జోక్ చేశాడు. ఆసిఫ్ వెల్లడించిన కోహ్లీ జోక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Aasif Sheikh said, “Virat Kohli jokingly told me ‘I should get a medal too, I dropped your catch’ (smiles)”. pic.twitter.com/cvgQ8URuTR
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 6, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

