భోపాల్: స్టార్ షూటర్ మనూ భాకర్, పురుషుల విభాగంలో విజయ్‌వీర్ సిద్ధూ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో విజేతలుగా నిలిచారు. భోపాల్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్‌లో భాగంగా మహిళల విభాగంలో మనూ 586 స్కోరు చేసి స్వర్ణం గెలవగా సిమ్రన్ప్రీత్, అభిధ్న్య తదుపరి స్థానాల్లో నిలిచారు. పారిస్ బెర్తును ఖరారు చేసుకున్న హైదరాబాదీ షూటర్ ఇషాసింగ్ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. పురుషుల కేటగిరీలో విజయ్‌వీర్ స్వర్ణం నెగ్గగా అనీష్, ఆదర్శ్ సింగ్ రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నారు. బుధవారం పురుషుల, మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో సెలక్షన్స్ జరుగనున్నాయి.