bomb threats | కొనసాగుతున్న బాంబు బెదిరింపులు.. తాజాగా పది స్కూళ్లకు ఈమెయిల్స్
bomb threats | దేశంలోని పలు రాష్ట్రాలకు బాంబు బెదిరింపులు (bomb threats) వస్తున్నాయి. స్కూళ్లు, ఆసుపత్రులు, ఎయిర్‌పోర్ట్స్ వంటి వాటిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా మరో పది స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు.
లక్నో: దేశంలోని పలు రాష్ట్రాలకు బాంబు బెదిరింపులు (bomb threats) వస్తున్నాయి. స్కూళ్లు, ఆసుపత్రులు, ఎయిర్‌పోర్ట్స్ వంటి వాటిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా మరో పది స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో సుమారు పది స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. బాంబులతో పేల్చివేస్తామంటూ ఆ స్కూళ్లకు ఈమెయిల్స్ అందాయి.
కాగా, ఈ విషయం తెలియడంతో జిల్లా యంత్రాంగతం అప్రమత్తమైంది. పోలీసులు, బాంబు నిర్వీర్య బృందాలు ఆయా స్కూళ్లకు చేరుకుని తనిఖీలు చేపట్టాయి. విద్యార్థులు, స్కూల్స్ సిబ్బందిని ఇళ్లకు పంపివేశారు. రష్యాలోని సర్వర్ల ద్వారా ఈమెయిల్స్ వచ్చాయని పోలీస్ అధికారి తెలిపారు. స్కూళ్లకు బాంబు బెదిరింపులపై సైబర్ సెల్ విభాగం దర్యాప్తు చేస్తున్నదని చెప్పారు.
మరోవైపు మంగళవారం బెంగళూరులోని ఎనిమిది స్కూళ్లకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. గత వారం కూడా నగరంలోని ప్రముఖ హాస్పిటల్ చైన్ అయిన సెయింట్ ఫిలోమినాకు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ బెదిరింపు ఈమెయిల్ అన్నీ బూటకమని ఆ తర్వాత తేలింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bomb Threat
- emails
- Kanpur
- schools
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

