ధవన్‌ను ఇమిటేట్ చేసిన కోహ్లీ.. వీడియో వైరల్
Virat Kohli imitates Dhawan| టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీలో అభిమానులకు నచ్చే చాలా అంశాలున్నాయి. వాటిలో అతని హ్యూమర్ ఒకటి.

Virat Kohli imitates Dhawan| టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీలో అభిమానులకు నచ్చే చాలా అంశాలున్నాయి. వాటిలో అతని హ్యూమర్ ఒకటి. తోటి ఆటగాళ్లపై అప్పుడప్పుడూ మంచి జోకులేస్తూ ఉండటం, వారిని ఇమిటేట్ చేసి నవ్వించడం కోహ్లీకి అలవాటే.
తాజాగా టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్‌ను ఇమిటేట్ చేస్తూ ఒక వీడియో షేర్ చేశాడు కోహ్లీ. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. టీ20 ప్రపంచకప్ కోసం కోహ్లీ ప్రస్తుతం యూఏఈలోను ఉన్నాడు. ఐపీఎల్లో రాణించినా కూడా ధవన్‌కు ఈ ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కలేదు.
‘‘హాయ్.. నేను విరాట్ కోహ్లీ. ఇప్పుడు శిఖర్ ధవన్‌ను మిమిక్ చేస్తాను. ఎందుకంటే అతను ప్రస్తుతం ఆలోచనల్లో మునిగిపోయాడని అనిపిస్తోంది. ధవన్ బ్యాటింగ్ చేసే విధానం ఫన్నీగా ఉంటుంది. ఎదుటి క్రీజులో నిలబడి దాన్ని నేను చాలాసార్లు చూశా’’ అంటూ కోహ్లీ వీడియోను ప్రారంభించాడు.

అనంతరం తన టీషర్టును ధవన్ మడుచుకున్నట్లే ఫోల్డ్ చేశాడు. ఆ తర్వాత ధవన్ స్టాన్స్‌లో నిలబడి అతని బ్యాటింగ్‌ను ఇమిటేట్ చేశాడు. ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు.
కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్లో కోహ్లీ సారధ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెగళూరు ప్లేఆఫ్స్ చేరింది. చివర్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో ఓటమితో కెప్టెన్‌గా ఐపీఎల్లో కోహ్లీ ప్రస్థానం ముగిసింది.
ఇకపై ఆర్సీబీ సారధిగా తను ఉండబోనని, ఆటగాడిగా కొనసాగుతానని ఐపీఎల్ రెండో దశ ప్రారంభంలోనే కోహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే టోర్నీలో ధవన్ ప్రాతినిధ్యం వహించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా ప్లేఆఫ్స్ చేరింది.
అయితే రెండు క్వాలిఫైయర్స్‌లో ఓటమిపాలై ఇంటిదారి పట్టింది. ఈ టోర్నీలో 16 మ్యాచులు ఆడిన ధవన్ 587 పరుగులు చేసి టాప్స్కోరర్ల జాబితాలో నిలిచాడు. కానీ అతన్ని టీ20 ప్రపంచకప్ జట్టులో ఎంపిక చేయకపోవడం ధవన్ అభిమానులను నిరాశపరిచింది.
Shikhi, how's this one? 😉@SDhawan25 pic.twitter.com/nhq4q2CxSZ
— Virat Kohli (@imVkohli) October 18, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

