ఢిల్లీ: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆడనున్నారు. ఈనెల 24 నుంచి మొదలుకాబోయే ఈ టోర్నీలో ఢిల్లీ జట్టుకు పంత్ సారథిగా వ్యవహరించనుండగా తొలి రెండు గేమ్స్‌కు విరాట్ కోహ్లీ ఆడేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాడు.
బీసీసీఐ కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లంతా దేశవాళీ ఆడాల్సిందేనని బోర్డు ఆదేశించిన విషయం తెలిసిందే. కోహ్లీ, పంత్‌తో పాటు వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ కూడా చోటు దక్కించుకున్నాడు.