బ్రిస్బేన్: దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) .. బ్యాటింగ్ ఇబ్బందులతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. పెర్త్‌లో సెంచరీ చేసిన అతను.. బ్రిస్బేన్‌లో జరుగుతున్న మూడవ టెస్టు మూడవ రోజు కేవలం 3 రన్స్‌కే ఔటయ్యాడు. కోహ్లీ తన ఆటతీరును మార్చకోలేకపోతున్నట్లు స్పష్టం అవుతున్నది. ఆస్ట్రేలియా టూర్లో అతని బ్యాటింగ్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఆఫ్ సైడ్ బంతిని డ్రైవ్ చేయబోయి.. మరోసారి అతను కీపర్‌కు చిక్కాడు. ఆస్ట్రేలియా పిచ్‌లపై ఇలా కోహ్లీ ఔట్ కావడం కామన్‌గా మారింది. ఆసీస్ పేస్ బౌలర్లు తమ లెన్త్, బౌన్స్‌తో కోహ్లీని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. దీంతో అతను ఈజీగా తన వికెట్‌ను సమర్పించుకుంటున్నాడు. ఇవాళ కూడా ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని ఆడబోయి కోహ్లీ ఔటయ్యాడు. జోష్ హేజిల్‌వుడ్ వేసిన వైడ్ డెలివరీని కొట్టబోయి దొరికిపోయాడు. కీపర్ అలెక్స్ క్యారీ ఈజీగా ఆ క్యాచ్ పట్టేశాడు.
Josh Hazlewood gets Virat Kohli!
The Australians are up and about on Day Three. #AUSvIND pic.twitter.com/sq6oYZmZAz
— cricket.com.au (@cricketcomau) December 16, 2024
విరాట్ ఆడుతున్న తీరుపై అభిమానలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ వెళ్తున్న బంతుల్ని ఎందుకు కోహ్లీ ఆడుతున్నాని ప్రశ్నించారు. కోహ్లీ కెరీర్ ఇటీవల ఒడిదిడుకులకు లోనైంది. ఈ మధ్య భారీ ఇన్నింగ్స్ ఆడిన సందర్భాలు కూడా తక్కువయ్యాయి. దూరంగా వెళ్తున్న బంతిని కొట్టబోయి.. కోహ్లీ ఔటైన విధానం అతనిలో ఉన్న ఆందోళనను స్పష్టం చేస్తున్నది. క్రీజ్‌లో ఎక్కువ సేపు గడపలేకపోతున్న కోహ్లీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. ఇంటర్నెట్ యూజర్లు రకరకాల కామెంట్లతో చెలరేగిపోతున్నారు.
Virat Kohli wagon wheel when Pitch is not flat pic.twitter.com/fApA4Kvw4J
— Abhishek (@be_mewadi) December 16, 2024