Virat Kohli | వన్డేల్లోనూ పడిపోయిన కోహ్లీ ర్యాంక్.. ఏడేళ్లలో ఇదే తొలిసారి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్ లేక నానా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. తీరికలేని ఆట వల్లనే కోహ్లీ ఫామ్ పోయిందనే ఉద్దేశ్యంతో వెస్టిండీస్ పర్యటనలో అతనికి పూర్తిగా రెస్ట్ ఇచ్చేశారు. దీంతో ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్నాడీ స్టార్ బ్యాటర్. కొన్ని రోజుల క్రితం ఇంగ్లండ్ పర్యటనలో అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచిన కోహ్లీ.. టెస్టుల్లో టాప్ టెన్ బ్యాటర్ల జాబితాలో చోటు కోల్పోయాడు.
టీ20ల్లో కూడా టాప్ టెన్ జాబితాలో నుంచి తప్పుకున్నాడు. అతనికి అచ్చొచ్చిన వన్డేల్లో కూడా కోహ్లీ ర్యాంకు కిందకు పడిపోతూనే వచ్చింది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో కోహ్లీ రేటింగ్ పాయింట్లు 774కు పడిపోయాయి. దీంతో అతను ఐదో స్థానానికి చేరాడు. గడిచిన ఏడేళ్లలో ఇదే కోహ్లీ వరస్ట్ ర్యాంక్. అక్టోబర్ 2015 తర్వాత టాప్ 4 వన్డే బ్యాటర్ల జాబితాలో కోహ్లీ స్థానం కోల్పోవడం ఇదే తొలిసారి.
అయితే పాకిస్తాన్ సారధి బాబర్ ఆజమ్ మాత్రం తన ఆధిపత్యం చెలాయిస్తూనే ఉన్నాడు. వన్డేలు, టీ20ల్లో టాప్ బ్యాటర్‌గా ఉన్న బాబర్.. టెస్టుల్లో కూడా తన స్థానం మెరుగు పరుచుకున్నాడు. శ్రీలంకపై అద్భుతంగా ఆడిన అతను టెస్టుల్లో మూడో ర్యాంకుకు చేరుకున్నాడు. దీంతో మూడు ఫార్మాట్లలో టాప్-3లో ఉన్న బ్యాటర్‌గా అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

