బెంగళూరు: ఆసియా కప్ టోర్నీకి ముందు భారత క్రికెటర్లు యో యో టెస్టుకు హాజరయ్యారు. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో గురువారం కఠినమైన ఫీల్డింగ్ డ్రిల్స్‌తో పాటు ప్లేయర్లకు ఫిట్నెస్ పరంగా యో యో పరీక్ష నిర్వహించారు.
ఇందులో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సహచర క్రికెటర్ల కంటే 17.2 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. బీసీసీఐ నిర్దేశించిన 16.5 పాయింట్‌కు అనుగుణంగా కెప్టెన్ రోహిత్‌శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ పరీక్ష ఎదుర్కొన్నారు.