Virat Kohli | టీం ఇండియా టెస్ట్ సారధి విరాట్ కోహ్లీ తన కెరీర్లో రెండు రికార్డులు నెలకొల్పాడు. టెస్ట్ క్రికెట్లో 100 వికెట్లు తీసిన టీంఇండియా క్రికెటర్ల క్లబ్లో చేరాడు. కేప్‌టౌన్‌లో సఫారీలపై మూడో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్ టెంబా బవుమా కొట్టిన బంతిని కోహ్లీ క్యాచ్ పట్టాడు. దీంతో టెంబా బవుమా పెవిలియన్ దారి పట్టాడు.
టీం ఇండియా హెడ్ కోచ్, మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్.. టెస్ట్ కెరీర్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ప్లేయర్‌గా నిలిచాడు. రాహుల్ ద్రావిడ్ 164 మ్యాచ్‌ల్లో 210 క్యాచ్‌లు పట్టాడు. తర్వాతీ స్థానంలో 134 మ్యాచ్‌ల్లో 135 క్యాచ్‌లు పట్టిన వీవీఎస్ లక్ష్మణ్.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 200 టెస్ట్మ్యాచ్ల్లో 115 క్యాచ్‌లు పట్టాడు. మరో లెజెండరీ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ 125 టెస్ట్ మ్యాచ్‌ల్లో 115 క్యాచ్‌లు పట్టాడు.
టీం ఇండియా మాజీ సారధి మహమ్మద్ అజారుద్దీన్ 99 మ్యాచ్‌ల్లో 105 క్యాచ్‌లు పట్టుకున్నాడు. ఇక విరాట్ కోహ్లీ తన కెరీర్లో 99 టెస్ట్ మ్యాచ్‌లోనే వికెట్లలో సెంచరీ పూర్తి చేశాడు. ఆయన బాటలోనే అజింక్యా రహానే క్యూలో ఉన్నాడు. 82 టెస్ట్ మ్యాచ్‌ల్లోనే 99 క్యాచ్‌లు చేజిక్కించుకున్నాడు. వికెట్ల సెంచరీకి మరో వికెట్ దూరంలో నిలిచాడు.
అంతకుముందు తొలి రోజు టీం ఇండియా బ్యాటింగ్‌లో రాహుల్ ద్రావిడ్ రికార్డును కోహ్లీ అధిగమించాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కోహ్లీ.. సఫారీల గడ్డపై అత్యధిక పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ 1992-2011 మధ్య సౌతాఫ్రికాపై 15 టెస్ట్‌ల్లో 1161 పరుగులు చేశాడు. రాహుల్‌ద్రావిడ్ 624 పరుగులు చేశాడు. కోహ్లీ కేవలం ఏడు టెస్ట్ మ్యాచ్‌ల్లోనే 690 పరుగులు చేసి.. ద్రావిడ్ రికార్డును అధిగమించాడు.