కరోనా మహమ్మారిపై పోరాటానికి టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతడి భార్య అనుష్క శర్మ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. కరోనా బాధితులకు సాయం చేసేందుకు నిధుల సమీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఈ దంపతులు రూ.2 కోట్ల విరాళం ప్రకటించారు. కెంటో ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రజల నుంచి దాదాపు రూ.7 కోట్లు విరాళంగా సేకరించాలని సంకల్పించారు.
నిధుల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన వస్తున్నదని విరాట్ కోహ్లీ ట్విటర్లో వెల్లడించాడు.
‘కార్యక్రమాన్ని ప్రారంభించిన 24 గంటల్లోపే రూ.3.6కోట్లు నిధులు వచ్చాయి. మంచి స్పందన వస్తున్నది. మన లక్ష్యాన్ని చేరుకోవడానికి, దేశానికి సహాయం చేయడానికి నిరంతరం పోరాడుతూనే ఉంటాం. థాంక్స్’ అంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు.
వైద్యులను ఏర్పాటు చేయడం, వ్యాక్సినేషన్‌పై అవగాహన, టెలీ మెడిసన్ సదుపాయాలు సహా మరిన్ని ఏర్పాట్ల కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. ఇందుకోసం యాక్ట్ గ్రాంట్స్ అనే సంస్థతో చేతులు కలిపారు. ఏడు రోజుల పాటు ఈ విరాళాల సేకరణ కార్యక్రమం కొనసాగుతుంది.
3.6 crores in less than 24 hours! Overwhelmed with the response. Let’s keep fighting to meet our target and help the country. Thank you.🙏#InThisTogether #ActNow #OxygenForEveryone #TogetherWeCan #SocialForGood@ketto @actgrants pic.twitter.com/ZCyAlrgOXj
— Virat Kohli (@imVkohli) May 8, 2021