రాయ్‌పూర్: మాస్టర్ ఛేజర్ విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ .. హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డే(INDvSA)లో ఇద్దరూ సమయోచిత బ్యాటింగ్ చేస్తున్నారు. గైక్వాడ్ 52 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 50 రన్స్ స్కోరు చేయగా, 47 బంతుల్లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో కోహ్లీ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. రాంచీ వన్డేలో సెంచరీ కొట్టిన కోహ్లీ.. ఇవాళ రాయ్‌పూర్‌లో కూడా టాప్ ఫామ్‌లో ఉన్నాడు. గైక్వాడ్, కోహ్లీ.. మూడో వికెట్‌కు అజేయంగా వంద రన్స్ పైగా జోడించారు.
1⃣0⃣0⃣ in the 1st ODI
FIFTY and counting in the 2nd ODI 🙌
Virat Kohli in terrific touch ✨
Updates ▶️ https://t.co/oBs0Ns6SqR#INDvSA | @IDFCFIRSTBank | @imVkohli pic.twitter.com/yKmdQxkjd1
— BCCI (@BCCI) December 3, 2025
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నది. అయితే భారత ఓపెనర్లు జైస్వాల్ 22, రోహిత్ 14 రన్స్ చేసి ఔటయ్యారు. వన్డేల్లో గైక్వాడ్ రెండో హాఫ్ సెంచరీ స్కోరు చేశాడు. కోహ్లీ, గైక్వాడ్‌లు క్రమంగా బౌండరీలు సాధిస్తున్నారు. ఈ సిరీస్‌లో కోహ్లీ తన బ్యాటింగ్‌తో ఇరగదీస్తున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ కొట్టిన అతను.. ఇవాళ రెండో వన్డేలోనూ మరో సెంచరీ దిశగా పయనిస్తున్నాడు.
Half-century for Ruturaj Gaikwad!
He gets to his 2nd ODI FIFTY 👏👏
1⃣5⃣0⃣ up for #TeamIndia!
Updates ▶️ https://t.co/oBs0Ns6SqR#INDvSA | @IDFCFIRSTBank | @Ruutu1331 pic.twitter.com/WUlruZqfKR
— BCCI (@BCCI) December 3, 2025
తాజా సమాచారం ప్రకారం ఇండియా 27 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 177 రన్స్ చేసింది.