రాయ్‌పూర్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. మొదటి వన్డే మ్యాచ్‌లో భారత్ 12 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. ఇవాళ రెండో వన్డే ఆడేందుకు రెండు జట్లు రాయ్‌పూర్‌కు చేరుకున్నాయి. ఈ క్రమంలో భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రిపోర్టర్ అవతారమెత్తాడు.
ఒక రిపోర్టర్లా భారత డ్రెస్సింగ్ రూమ్ గురించి వివరిస్తూ నవ్వులు పూయించాడు. ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో చాహల్ ఓ మైక్ పట్టుకుని మాట్లాడుతూ ఇవాళ మ్యాచ్ జరగబోయే షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను చూపించాడు.
ఆ తర్వాత మా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్దాం రండి అంటూ లోపలికి వెళ్లాడు. అక్కడ సీటింగ్ ఏరియాను చూపిస్తూ వివరాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఈయన మా కెప్టెన్ రోహిత్ శర్మ అంటూ కూర్చుని ఉన్న రోహిత్‌ను చూపించాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ దగ్గరికి వెళ్లి ఓ చిన్న ఫన్నీ ఇంటర్వ్యూ చేశాడు. అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లోని మసాజ్ టేబుల్ గురించి వివరించాడు.
మసాజ్ టేబుల్ గురించి చెబుతున్న సమయంలోనే ఫ్రేమ్‌లోకి వచ్చిన రోహిత్ శర్మ ఫన్నీ కామెంట్ చేశాడు. రిపోర్టింగ్ చేస్తున్న చాహల్‌తో నవ్వుతూ ‘నీకు చాలా మంచి భవిష్యత్ ఉంది’ అనుకుంటూ వెళ్లిపోయాడు. దాంతో చాహల్ నవ్వుతూ డైనింగ్ హాల్లోకి వెళ్లాడు. అక్కడున్న వంటకాలను చూపిస్తూ.. ఒక్కో వంటకం పేరు చెప్తూ వెళ్లాడు. ఈ ఫన్నీ వీడియోపై మీరు కూడా ఒక లుక్కేయండి..
Inside #TeamIndia‘s dressing room in Raipur! 👌 👌
𝘼 𝘾𝙝𝙖𝙝𝙖𝙡 𝙏𝙑 📺 𝙎𝙥𝙚𝙘𝙞𝙖𝙡 👍 👍 #INDvNZ | @yuzi_chahal pic.twitter.com/S1wGBGtikF
— BCCI (@BCCI) January 20, 2023