Rohit Sharma | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోహిత్ ఆసుపత్రిలోకి వస్తున్నట్లుగా వీడియోలు, ఫొటోల్లో కనిపించింది. అయితే, రోహిత్ ఆసుపత్రికి ఎందుకు వచ్చాడన్నది మాత్రం తెలియరాలేదు. దాంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. త్వరలో జరుగనున్న ఆస్ట్రేలియా సిరీస్‌కు తిరిగి వన్డే జట్టులోకి చేరుతాడని భావిస్తుండగా.. ఆసుపత్రికి వెళ్లడం షాక్‌కు గురి చేసింది. ఆసుపత్రికి యాజమాన్యం సైతం స్పందించలేదు.
ROHIT SHARMA AT THE KOKILABEN HOSPITAL IN MUMBAI. (Pallav Paliwal).
— Tanuj (@ImTanujSingh) September 8, 2025
కేవలం సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగానే ఆసుపత్రికి వెళ్లినట్లుగా భావిస్తున్నారు. బిజీ క్రికెట్ షెడ్యూల్‌కు ముందు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం సాధారణమైన విషయమేనని గుర్తు చేస్తున్నారు. అయితే, చాలారోజులుగా మైదానానికి దూరం కాగా.. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు ముందు ఆసుపత్రికి వెళ్లడం అందరినీ షాక్‌కు గురయ్యారు. రోహిత్ చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తరఫున ఆడాడు. ఐపీఎల్ సమయంలో ముంబయి ఇండియన్స్ తరఫున చివరి మ్యాచ్ ఆడాడు.
ఈ ఏడాది టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు రిటైర్మెంట్ ప్రకటించాడు. 67 టెస్ట్‌ల్లో 4301 పరుగులకు 40.58 సగటుతో మంచి స్కోరు సాధించిన 38 సీనియర్ బ్యాట్స్‌మెన్.. అంతకు ముందు టీ20లకు వీడ్కోలు పలికాడు. ఈ ఫార్మాట్లో భారత్‌కు ఐసీసీ టైటిల్‌ను అందించి.. టీ20లకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఇటీవల సియెట్ ఈవెంట్లో పాల్గొని మాట్లాడాడు. టెస్ట్ ఫార్మాట్లో ఐదురోజులు ఆడాల్సి ఉంటుందని.. మానసికంగా, శారీరకంగా సవాల్‌తో కూడుకున్నదని తెలిపాడు.