Vinod Kambli | భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి (Vinod Kambli) అనారోగ్యంతో పది రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. మూత్రనాళాల ఇన్ఫెక్షన్తో అతడు దవాఖానలో చేరగా వైద్య పరీక్షల్లో అతడి మెదడులో రక్తం గడ్డకట్టినట్టు తేలింది (Medical Tests Reveal Clots In Brain). ప్రస్తుతం ఆయన థానే జిల్లాలోని కల్హర్లో ఉన్న ఆకృతి ఆసుపత్రిలో (Thane hospital) చికిత్స పొందుతున్నారు. అనారోగ్యం నుంచి క్రమంగా కోలుకుంటున్నారు. ఈ క్రమంలో కాంబ్లి ఓ హిందీ పాటకు డ్యాన్స్ చేశారు.
తన గదిలో అక్కడి సిబ్బందితో కలిసి ‘చక్ దే ఇండియా’ పాటకు ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేశారు. కాంబ్లి డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరోవైపు తన ఆరోగ్య పరిస్థితిపై కాంబ్లి ఇటీవలే స్పందించిన విషయం తెలిసిందే. వైద్యుల వల్ల తాను బతికే ఉన్నానని తెలిపారు. ‘ఇక్కడి డాక్టర్ల వల్ల నేను బతికి ఉన్నాను’ అంటూ హాస్పిటల్ బెడ్‌పై నుంచి స్టేట్మెంట్ ఇచ్చారు.
Vinod Kambli danced in the hospital😀 #VinodKambli pic.twitter.com/uYxnZMbY1u
— Cricket Skyblogs.in (@SkyblogsI) December 31, 2024
Also Read..
“కాంబ్లీకి 5 లక్షల ఆర్థిక సాయం”
“Vinod Kambli | జ్వరం బారినపడ్డ మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ.. నిలకడగానే ఆరోగ్యం..!”
“Vinod Kambli | వారి వల్ల నేను బతికి ఉన్నాను : వినోద్ కాంబ్లి”
“Vinod Kambli | మరోసారి ఆసుపత్రిలో చేరిన వినోద్ కాంబ్లీ.. విషమంగా ఆరోగ్యం”