Vinod Kambli | మరోసారి ఆసుపత్రిలో చేరిన వినోద్ కాంబ్లీ.. విషమంగా ఆరోగ్యం
Vinod Kambli | క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చిన్ననాటి స్నేహితుడు, భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మరోసారి ఆసుపత్రి పాలయ్యారు.
Vinod Kambli | క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చిన్ననాటి స్నేహితుడు, భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మరోసారి ఆసుపత్రి పాలయ్యారు. గత శనివారం కాంబ్లీ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో థానేలోని ఆకృతి ఆసుపత్రిలో (Thane Hospital) చేరారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిసింది. మీడియా కథనాల ప్రకారం చికిత్సకు కాంబ్లీ సహకరిస్తున్నప్పటికీ.. పరిస్థితి మాత్రం విషమంగా (Condition Critical) ఉన్నట్లు తెలిసింది. ఆయన ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు, అభిమానులు కాంబ్లీ ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు.
కాంబ్లీ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే నడవలేని స్థితిలో వీల్‌చైర్‌లో కనిపించారు. దీంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే, తాను బాగానే ఉన్నానంటూ కాంబ్లీ తెలిపారు. ఇప్పుడు మరోసారి ఆసుపత్రిపాలవడంతో క్రికెట్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
In pictures: Cricketer Vinod Kambli’s condition deteriorated again, leading to his admission at Akriti Hospital in Thane late Saturday night. His condition is now stable but remains critical. pic.twitter.com/7NBektzQ54
— IANS (@ians_india) December 23, 2024
Also Read..
SA Vs PAK: సఫారీలపై పాకిస్థాన్ క్లీన్ స్వీప్.. మూడో వన్డేలో విక్టరీ
Champions Trophy 2025 | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ.. భారత్ – పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ ఎప్పుడంటే..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

