జొహన్నస్‌బర్గ్: సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ను పాకిస్థాన్(SA Vs PAK) క్లీన్ స్వీప్ చేసింది. మూడవ వన్డేలో డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం.. 36 రన్స్ తేడాతో పాక్ విజయం సాధించింది. పాకిస్థాన్ ఓపెనర్ సయిమ్ అయూబ్ 94 బంతుల్లో 101 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వాండరర్స్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలుత 9 వికెట్ల నష్టానికి 308 రన్స్ చేసింది. ఆ తర్వాత వర్షం వల్ల మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదిరించారు. 308 టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 42 ఓవర్లలో 271కు ఆలౌటైంది.
పాక్ బ్యాటర్ అయూబ్ రెండు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. బాబర్ ఆజమ్‌తో రెండో వికెట్‌కు114 రన్స్ జోడించాడు. ఆ తర్వాత రిజ్వాన్‌తో కలిసి మూడో వికెట్‌కు 93 రన్స్ జోడించాడు. 22 ఏళ్ల అయూబ్ తొలి వన్డేలో కూడా సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో అయూబ్ రెండు సిక్సర్లు, 13 ఫోర్లు బాదాడు. మిడిల్ ఆర్డర్లో సల్మాన్ ఆఘా 33 బంతుల్లో 48 రన్స్ చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబడ 3 వికెట్లు తీసుకున్నాడు.
ఛేజింగ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్ క్లాసెన్ అత్యధికంగా 81 రన్స్ చేశాడు. బాష్ 40 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. పాక్ స్పిన్నర్ సుఫియాన్ ముఖీమ్ 52 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. తొలి వన్డేను 3 వికెట్ల తేడాతో, రెండో వన్డేను 81 రన్స్ తేడాతో పాక్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే టీ20 సిరీస్‌ను మాత్రం 2-0 తేడాతో దక్షిణాఫ్రికా గెలిచింది. గురువారం నుంచి రెండు దేశాల మధ్య రెండు టెస్టుల సిరీస్ జరగనున్నది.
🌟 Player of the match and player of the series 🌟
How will you rate @SaimAyub7‘s scintillating show this series❓#SAvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/CIx50U3nHi
— Pakistan Cricket (@TheRealPCB) December 22, 2024