ముంబై: మూత్రనాళాల సమస్యతో బాధపడుతూ భీవండిలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్న భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. కళ్యాణ్ లోక్సభ నుంచి ఎంపీగా ఉన్న ఆయన.. డాక్టర్ శ్రీకాంత్ షిండే ఫౌండేషన్ ద్వారా ఈ సాయం అందజేస్తామని తెలిపారు.
కాగా యూరినరీ ఇన్ఫెక్షన్ తగ్గినప్పటికీ కాంబ్లీ జ్వరంతో బాధపడుతున్నాడు. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో అతడి మెదడును స్కానింగ్ చేయాలని వైద్యులు భావించినప్పటికీ జ్వరం కారణంగా అది సాధ్యపడలేదని డాక్టర్ వివేక్ త్రివేది తెలిపారు.