ముంబై: మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి ఆరోగ్యం నిలకడగా ఉంది. మూత్రనాళాల ఇన్ఫెక్షన్, మెదడులో రక్తం గడ్డ కట్టడంతో రెండ్రోజుల క్రితం దవాఖానలో చేరిన కాంబ్లి వైద్యానికి స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు.
ఇన్ఫెక్షన్ను తొలగించామని, అయినా మరో 24 గంటల వరకూ ఆయనను వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతామని డాక్టర్ త్రివేది చెప్పారు.