Yogeshwer Dutt | స్టార్ రెజ్లర్, కాంగ్రెస్ నేత వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat)పై బీజేపీ నేత, రెజ్లర్ యోగేశ్వర్ దత్ (Yogeshwar Dutt) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒలింపిక్స్‌లో బరువు పెరగడం ఆమె తప్పేనన్నారు. ఒక్క గ్రాము బరువు పెరిగినా అనర్హత వేటు పడుతుందని ఆమెకు తెలియదా..? అని ప్రశ్నించారు. దీన్ని కుట్రగా పేర్కొనడం సరికాదన్నారు. ఈ విషయంలో దేశ ప్రజలకు వినేశ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమె స్థానంలో తాను ఉండి ఉంటే ఈపాటికి ఎప్పుడో దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పేవాడినని అన్నారు.
పంచాయత్ ఆజ్‌తక్ హర్యానా 2024 ఈవెంట్లో యోగేశ్వర్ మాట్లాడుతూ.. ‘పారిస్ ఒలింపిక్స్‌లో అధిక బరువు కారణంగా వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. ఇందుకు దేశ ప్రజలకు వినేశ్ క్షమాపణలు చెప్పాలి. అలా కాకుండా ఈ ఘటనను ఆమె కుట్రగా అభివర్ణించారు. తన అనర్హత గురించి వినేశ్ కుట్ర సిద్ధాంతాలను వ్యాప్తి చేయడం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా నిందించారు. ఒలింపిక్స్‌లో బరువు పెరగడం ఆమె తప్పే. దీన్ని కుట్రగా పేర్కొనడం సరికాదు. ఒలింపిక్స్‌లో ఒక గ్రాము బరువు పెరిగినా అనర్హత వేటు పడుతుందని ఆమెకు తెలియదా..? ఆమె స్థానంలో నేను ఉండి ఉంటే ఈపాటికి ఎప్పుడో దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పేవాడిని. ఈ విషయంలో దేశ ప్రజలను వినేశ్ తప్పుదోవ పట్టించారు. దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రవర్తించారు’ అని వినేశ్‌పై యోగేశ్వర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాగా, ఇటీవలే జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో 50 కేజీల మహిళల రెజ్లింగ్ విభాగంలో 100 గ్రాముల అధిక బరువు కారణంగా వినేశ్‌పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. దీంతో ఆమె రెజ్లింగ్‌కి వీడ్కోలు పలికింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరింది. ప్రస్తుతం హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జులానా స్థానం నుంచి పోటీకి సిద్ధమైంది. ఇక ఈ స్థానం నుంచి వినేశ్‌పై పోటీకి బీజేపీ యోగేశ్ బైరాగిని రంగంలోకి దింపింది. మరోవైపు, ఆమ్ఆద్మీ పార్టీ కూడా తన అభ్యర్థిగా డబ్ల్యూడబ్ల్యూఈ మహిళా రెజ్లర్ కవితా దలాల్‌ను నిలబెట్టింది. ఈ రాజకీయ రెజ్లింగ్ పోటీలో ఎవరు గెలుస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కాగా, 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.
Also Read..
Asha Bhosle | విడాకుల సంఖ్య పెరగడానికి ఇదే ప్రధాన కారణం : ఆశా భోంస్లే
CM Chandrababu | తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత జగన్‌కు లేదా..? : సీఎం చంద్రబాబు