Vinesh Phogat : విశ్వ క్రీడల్లో ఊహించిన విధంగా పతకం కోల్పోయిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat)కు సొంతగడ్డపై అపూర్వ స్వాగతం లభించింది. ఢిల్లీ విమానాశ్రయం (Delhi Airport) అవతల భారీగా జమకూడిన అభిమానులు వినేశ్‌కు చాంపియన్ తరహాలో వెల్కమ్ చెప్పారు. పారిస్ ఒలింపిక్స్‌లో పతకం చేజారిన బాధలో ఉన్న రెజ్లర్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది.
వాళ్లందరూ తనపై చూపిస్తున్న అభిమానానికి, ప్రేమకు ఫిదా అయిన ఆమె అనంతరం మీడియాతో మాట్లాడింది. ‘మీ ప్రేమ ముందు వెయ్యి బంగారు పతకాలైనా తక్కువే’ అని వినేశ్ అంది. పారిస్ నుంచి వినేశ్ శనివారం ఢిల్లీ వచ్చింది. అక్కడ రెజ్లర్లు బజ్రంగ్ పూనియా, సాక్షి మాలిక్ ఆధ్వర్యంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది.
चैंपियन बहन विनेश फोगाट आपको 140 करोड़ देशवासी स्वर्ण पदक विजेता मानते हैं।
सभी देशवासियों की तरफ से जीत का प्रतीक हनुमान जी की गदा भेंट की। @Phogat_Vinesh #वेलकम_विनेश pic.twitter.com/oRDeIQ1mw7
— Deepender S Hooda (@DeependerSHooda) August 17, 2024
‘చాంపియన్ నీకు స్వాగతం’ అంటూ మెడలో పూల దండ, నోట్ల కట్లు వేసి మరీ అభిమానులు వినేశ్‌కు వెల్కమ్ చెప్పారు. దాంతో, ఒలింపిక్ మెడల్ గెలవలేకపోయాననే బాధ నుంచి ఆమె కాస్త తేరుకుంది. అనంతరం మాట్లాడుతూ మీ అందరికీ ధన్యవాదాలు. నేను చాలా అదృష్టవంతురాలిని అని వినేశ్ చెమర్చిన కళ్లతో అంది. ఆ తర్వాత ఆమె స్వగ్రామమైన బలాలికి వెళ్లింది.
“I want to thank the people of the country who were supporting us in our fight. Our fight is not over yet,” said wrestler #VineshPhogat, who received a rousing welcome at IGI airport in New Delhi.
Express photos | @Shekharyadav02. pic.twitter.com/x83Xs3tdSI
— The New Indian Express (@NewIndianXpress) August 17, 2024
ఒలింపిక్స్ పతకం కోసం నిరీక్షిస్తున్న వినేశ్ ఫొగాట్ పారిస్‌లో ఆ దిశగా దూసుకెళ్లింది. 50 కిలోల విభాగంలో తన ఉడుంపట్టుతో ఫైనల్ చేరింది. ఇంకేముంది ఈసారి స్వర్ణం మనదే అనుకున్నారంతా. కానీ, అనూహ్యంగా 100 గ్రాముల అదనపు బరువు ఆమెతో పాటు యావత్ భారత్‌కు గుండెకోతను మిగిల్చింది. తనను అనర్హురాలిగా ప్రకటించాడాన్ని వినేశ్ అర్బిట్రేషన్ కోర్టు సీఏఎస్‌లో సవాల్ చేసినా నిరాశ తప్పలేదు. సదరు కోర్టు ఏ కారణం చెప్పకుండానే వినేశ్‌కు రజతాన్ని తిరస్కరించింది.