Citroen Basalt | ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ (Citroen) తన ఎస్యూవీ కూపే (SUV Coupe) తరహా కారు సిట్రోన్ బసాల్ట్ (Citroen Basalt) డెలివరీ సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రారంభించనున్నది. ఈ కారు బేస్ వేరియంట్ ధర రూ.7.99 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలికితే, టాప్ హై ఎండ్ వేరియంట్ రూ.13.62 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. దేశీయ మిడ్ సైజ్ ఎస్యూవీ కార్లలో అత్యంత చౌక ధరకు లభించే కారు ఇది. ఆసక్తి గల కార్ల ప్రేమికులు రూ.11,001 చెల్లించి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ఇక డ్యుయల్ టోన్ కలర్ ఆప్షన్ విత్ మ్యాక్స్ వేరియంట్ కావాలంటే కొనుగోలుదారులు అదనంగా రూ.21 వేలు పే చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 85 షోరూమ్ లు నిర్వహిస్తోంది. ఈ ఏడాది చివరికల్లా సేల్స్ నెట్ వర్క్ పెంచుకోవాలని తలపోస్తున్న సిట్రోన్ (Citroen) కొత్తగా 100 సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
సిట్రోన్ బసాల్ట్ (Citroen Basalt) కారు 1.2 లీటర్ల జెన్-3 ప్యూర్ టెక్ 110 టర్బో (110 బీహెచ్పీ విద్యుత్, 190 ఎన్ఎం టార్క్), 1.2 లీటర్ల ప్యూర్ టెక్ 82 నేచురల్లీ ఆస్పిరేటెడ్ (82 బీహెచ్పీ విద్యుత్, 110 ఎన్ఎం టార్క్) వేరియంట్లలో లభిస్తుంది. నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ వేరియంట్ 5-స్పీడ్తోపాటు ఈ కారు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది.
హ్యుండాయ్ క్రెటా (Hyundai Creta), కియా సెల్టోస్ (Kia Seltos), మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara), టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Urban Cruiser Hyryder), హోండా ఎలివేట్ (Honda Elevate), స్కోడా కుషాక్ (Skoda Kushaq), ఫోక్స్ వ్యాగన్ టైగూన్ (Volkswagen Taigun), టాటా కర్వ్ (Tata Curvv) కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్నది సిట్రోన్ బసాల్ట్ (Citroen Basalt). సీ3 హ్యాచ్ బ్యాక్ (C3 hatchback), ఈ-సీ3 ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ (eC3 electric hatchback), సీ3 ఎయిర్ క్రాస్ ఎస్యూవీ (C3 Aircross) సీ5 ఎయిర్ క్రాస్ (C5 Aircross) తర్వాత భారత్ మార్కెట్లోకి వచ్చిన కారు బసాల్ట్ (Basalt).
Redmi A3x | రెడ్ మీ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ఏ3ఎక్స్.. ధరెంతంటే..?!
Jeep India Discounts | ఆ రెండు కార్లపై జీప్ ఇండియా డిస్కౌంట్.. గరిష్టంగా ఎంతంటే..?!
Kia India | కియా ఇండియా నుంచి రెండు ప్రీమియం కార్లు.. అక్టోబర్ 3న లాంచింగ్..!